పాత తరం వాళ్లకే కాదు.. నేటి జనరేషన్ కు కూడా సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుసు. ఆయన నటించిన సినిమాలను ఈ జనరేషన్ కూడా చూస్తుంది. ఆయన్ను ఇండస్ట్రీలో సోగ్గాడు అంటూ ముద్దుగా పిలిచేవారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు అంత అందంగా ఏ నటుడూ లేడు. అప్పటి నటీమణులు కూడా శోభన్ భాబు అంటే పడి చచ్చిపోయేవారట. అంత అందగాడు మరి.
ఇక.. శోభన్ బాబు ఎంత పెద్ద నటుడో అందరికీ తెలుసు కానీ.. ఆయన ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే.. ఒక సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మరో సూపర్ స్టార్ అయ్యాడు. ఏఎన్నార్ కొడుకు యువ సామ్రాట్ అయ్యాడు. ఎన్టీఆర్ కొడుకు యువరత్న అయ్యాడు. వాళ్లంతా సినిమాల్లోనే రాణించారు కానీ.. శోభన్ బాబు పిల్లలు మాత్రం సినిమాల్లోకి రాలేదు.
శోభన్ బాబు.. తన పిల్లలకు సినిమా నీడను కూడా తాకనియ్యలేదు. శోభన్ బాబుకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లలో ఎవరూ సినిమా ఇండస్ట్రీవైపు రాలేదు. వాళ్లందరికీ మంచి చదువు ఇప్పించారు శోభన్ బాబు.
అలాగే.. శోభన్ బాబు ఆర్థికంగా చాలా తెలివి ఉన్న వ్యక్తి. పైసాను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. అప్పట్లోనే ఎక్కువగా భూములు కొనుగోలు చేసి తన పిల్లలకు కావాల్సినంత ఆస్తిని ఇచ్చారు. కానీ.. పిల్లలను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు.
ప్రస్తుతం శోభన్ బాబు పిల్లలు చెన్నైలో స్థిరపడ్డారు. శోభన్ బాబు కొడుకు ప్రస్తుతం పెద్ద డాక్టర్. శోభన్ బాబు మనవడు కూడా చాలా అందంగా.. అచ్చం శోభన్ బాబులా ఉంటాడు కానీ.. శోభన్ బాబు పేరు చెప్పుకొని ఆయన కూడా సినిమాల్లోకి రాలేదు.