Lorry Horn: చాలా మంది వాహనాల వెనకాల విచిత్రమైన కొటేషన్స్ వేయించుకోవడం గమనిస్తూ ఉంటాము. ఇందులో కొన్ని బైక్స్ ఉంటాయి. కొన్ని కార్లు ,ఆటోలు కూడా ఉంటాయి. లారీ వెనకాల కూడా చాలా రకాల వాక్యాలు కనబడుతూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. అయితే లారీ లేదా ట్రక్స్ వెనకాల మనం ఎక్కువగా గమనించేది మాత్రం హార్న్ ఓకే ప్లీజ్ అని ఉండడం.
హార్న్ ప్లీజ్ అంటే ఒక అర్థం ఉంది కానీ, హార్న్ ఓకే ప్లీజ్ కి అర్థం ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మనం రోజూ చూసే చాలా విషయాల కి మనకు అర్థం తెలిసి ఉండదు. కానీ హార్న్ ఓకే ప్లీజ్ అనే పదం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం.చరిత్ర లో ఉన్న ఒక ఆధారం ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ట్రక్స్ మీద ఓకే (OK) అని రాసి ఉంచేవారు. ఓకే అంటే ఆన్ కిరోసిన్ (On Kerosene) అని దాని అర్థం. అలా రాసి ఉన్న వెహికల్ కిరోసిన్ మీద నడుస్తుంది అని తెలియజేస్తుంది.
ఇది అప్పట్లో ఒక హెచ్చరిక లాగా వాడుకునేవారు. ఎందుకంటే కిరోసిన్ తో బండి నడుస్తుంది కాబట్టి ఒకవేళ చిన్న ఎగ్జిట్ జరిగిన కూడా పెద్ద ప్రమాదం జరగవచ్చు అని ఆ హెచ్చరిక వాడేవారు. అదే ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నారు. మనం దీన్ని తరచుగా చూస్తూనే ఉంటాం కానీ దీని అర్థం మాత్రం మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. హార్న్ ఓకే ప్లీజ్ అని రాయడం వెనకాల ఉన్న సంగతి ఇదే.