Virtues : 1. విజయం కోసం : ఏదైనా రంగం లో అసాధారణమైన ప్రతిభ కలిగి ఉండి సద్గుణాలు లేని వ్యక్తి కంటే, కాస్త తక్కువ ప్రతిభ కలిగి ఉండి ఉన్నత స్థాయి ధర్మాలు కలిగిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. అంటే దీని అర్ధం సద్గుణాలు జీవితంలో విజయానికి కారణం అవుతాయి.
2. సవాళ్ళను : రిలేషన్ షిప్స్ సమస్యలు, ఉద్యోగంలో అనారోగ్యం,సమస్యలు, తిరస్కరణలు వంటి సవాళ్లు జీవితంలో ఒక భాగంగా ఉంటాయి. ధర్మాలు సాధన చేయడం అనేది ఒక వ్యక్తి బలంగా ఉండటానికి ఈ సవాళ్ళను సమర్ధ వంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. సహనం,కృతజ్ఞత, క్రమశిక్షణ, ధైర్యం ఈ ధర్మాలు జీవితంలో కఠినమైన సమయాల్లో మన లో ఉన్న అంతర్గత శక్తిని , ధైర్యాన్ని పెంచుతాయి .
3. మంచి రిలేషన్ : ఏ రిలేషన్ షిప్స్ లో అయినా విలువలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రిలేషన్ షిప్స్ వృద్ధి చెందడానికి ప్రేమ, క్షమ, కృతజ్ఞత, సహనం వంటి ధర్మాల సాధన చాలా అవసరం. ఈ విలువలు కలిగి ఉండడం వలన అవి ప్రేమ మరియు ఆనందాన్ని ఇచ్చి ఇంటిని స్వర్గం లా చేస్తాయి.
4. మెరుగైన ఆర్థిక స్థితి: ఒక వ్యక్తి ఎంత ఆస్తి కలిగి ఉన్న లేదా పెద్ద మొత్తం లో రాబడి ఉన్న ఆ వ్యక్తి కి క్రమ శిక్షణ అనేది లేకపోతే సొత్తు అంతా వ్యర్దం అయిపోతుంది. అప్పులు, నష్టాలు మిగులుతాయి.
5. ఆరోగ్యం: చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి కొంత క్రమశిక్షణ తో పాటు మన మీద మనకి ప్రేమ ఉండాలి, శరీరానికి, మనసుకు చాలా దగ్గయి దగ్గరి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనస్సును ప్రభావితం చేసేవి శరీరాన్ని కూడా ప్రభావితం చేయగలవు. మనస్సు లో కోపం, ద్వేషం, ఆగ్రహం తో నిండినప్పుడు,శరీరం లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పరిపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యం కాదు.