టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందిన దర్శకుడు కృష్ణవంశీ. అతను తీసిన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఖాతాలో గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఇప్పటికి కూడా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి. ఈయన డైరెక్ట్ చేసిన మిగిలిన సినిమాలు ఎలా ఉన్నా, అంతఃపురం సినిమా మాత్రం ఒక ఆణిముత్యం అనే చెప్పొచ్చు. రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో 1998 లో కక్షల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయింది. ఈ సినిమా ఒక్క డైరెక్టర్ కే కాకుండా ఇందులో నటించిన ప్రతీ ఒక్క నటీనటులకు మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టింది. సౌందర్య, సాయికుమార్ , జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఇలా అవార్డులను సైతం తెచ్చిపెట్టింది.
ఈ సినిమా మొత్తం హీరోయిన్ సౌందర్య తో పాటు ఒక చిన్న బాబు తిరుగుతూ ఉంటాడు గుర్తున్నాడా? ఆ సినిమాలో నటించేటప్పటికీ ఆ బాబు కేవలం రెండు సంవత్సరాల వయస్సు మాత్రమే. ఆ బాబు పేరు కృష్ణప్రదీప్. ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన మాస్టర్ కృష్ణ ప్రదీప్ కి కూడా నంది అవార్డు రావడం విశేషం.
కానీ అంత చిన్న వయసులో కూడా ఈ బాబు అంత బాగా నటించడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. రెండేళ్ల వయసులో తన నటనతో సత్తా చాటిన కృష్ణ ప్రదీప్ ఆ సినిమా తర్వాత మరే ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే, ఆ సినిమా వచ్చి ఇప్పటికి 22 ఏళ్ళు అవుతుంది. అంటే అతనికి 24 ఏళ్ళు.ఇప్పుడు కృష్ణ ప్రదీప్ ను చూస్తే అచ్చం హీరోలా ఉన్నాడు అంటున్నారు నెటిజన్లు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?