Girls: ఛామన ఛాయ లేదా నలుపు రంగులో ఉన్న వారు ఎక్కువగా ఇతరుల నుంచి విమర్శలు పేస్ చేస్తున్నారు.అమ్మాయిల ముఖం పై ఏదైనా మచ్చలున్న, లేక ఆమె జుట్టు కాస్త రింగులుగా ఉన్నా సరే విమర్శలు ఎదురవుతాయి. ఇన్ని మచ్చలుంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని విమర్శిస్తారు.ఆ విమర్శ విన్న ఆ అమ్మాయి పడే మానసిక వేదన ఎవరు అంచనా వేయలేరు.
ఈ రంగు ,రూపు ,ఎత్తు ,జుట్టు అనేవి మన చేతిలో ఉండే విషయాలు కాదు అది పుట్టుక తో నిర్ణయించబడింది.. ఇలాంటి వాటి గురించి విమర్శించి మనస్సు గాయపరచడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి..
నల్లగా ఉంది అంటూ వద్దనుకున్నా అమ్మాయి తన టీమ్ లో నలభై మందికి లీడర్ కావచ్చు.. లావుగా ఉందని నో చెప్పిన అమ్మాయి పెద్ద మంచి మనసున్న మనిషి కావచ్చు.. జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఉండవచ్చు. రింగుల జుట్టు ఉందని వద్దు అనుకున్న అమ్మాయి మంచి మోడల్ గా పేరు తెచ్చుకోవచ్చు.. మచ్చలున్నాయి అంటూ కాదన్న పిల్ల జీవితాన్ని కాపాడే డాక్టర్ కావచ్చు.. అందుకే వారి శరీర తత్వం, వారి రంగు ఆధారంగా కాకుండా వారి వ్యక్తిత్వాన్ని,నడవడికలను ఆధారంగా తీసుకొని సంబంధాలు కలుపుకోవాలి.
ఇక అమ్మాయిలు కూడా అర్ధం పర్ధం లేని ఈ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తమను మార్చుకోవాలని ప్రయత్నించకుండా మీదైన వ్యక్తిత్వంతో ఉండండి. మిమ్మల్ని గా ఇష్టపడే వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి.ఆ విమర్శలకు బాధ పడటం వంటివి చేయడం అర్ధం లేని చర్య అవుతుంది. ఆలోచన ధోరణి లో మార్పు రావాలి. లేదంటే ఎప్పటికి ఇలాంటి ఒత్తిళ్లతో బాధ పడుతూనే ఉంటారు.