NewsOrbit
న్యూస్

Cheating: మీ భాగస్వామి వేరొకరి మోజులో పడి  మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అనుకుంటున్నారా?

Cheating: పెళ్లి  అనేది ఇద్దరు వ్యక్తులను  జీవితాంతం కలిసి ఉండేలా చేసే   బందం. అయితే ఈ బంధంలో డబ్బు ,ఆస్తి ,సిరి సంపదలు లేక పోయిన బాధ కలగదు కానీ    వివాహమాడిన వ్యక్తిని తనను మోసం చేసి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం  పెట్టుకోవడం  అనేది భరించరానిది.అస్సలు ఏమాత్రం తట్టుకోలేనిది.   అయితే ఒక వ్యక్తి తన భాగస్వామిని జీవితాంతం సంతోషం గా  చూసుకోగలడా? లేదా భాగస్వామిని ఏమార్చి  వేరొక వ్యక్తితో  అఫ్ఫాయిర్  పెట్టుకుంటాడా? అనే విషయం  మాత్రం ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలో అసలు ఇలాంటి సంబంధాలు పెట్టుకునేవారు, భాగస్వామిని మోసం చేసే వారిలో ఉండే ఓ  కామన్ పాయింట్ ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

తరచూ ఆవేశానికి లోనయ్యేవారు.. ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకునేవారు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది అని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీ ప్రచురితమైన ఓ కథనం ప్రకారం తెలుస్తుంది.   దీనితో పాటు  వారు తమ భాగస్వామి ని మాయ చేసి  ఇతరులతో అక్రమ సంబంధాన్ని  కొనసాగించే  అవకాశాలు ఎక్కువ. దీని వెనుక ఉన్న కారణాలను కూడా విశ్లేషించి చెప్పారు శాస్త్రవేత్తలు.
ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకునేవారు మోసం చేసే ముందు   అస్సలు ఆలోచించరట. అలాగే  తమ పరిస్థితి గురించి కూడా అస్సలు మాత్రం ఆలోచన లేకుండా అక్రమ సంబంధం వైపు  మొగ్గుచూపుతారట. దీనితో పాటు  ఈ పరిశోధనలో మరో విషయాన్ని కూడా బయట పెట్టారు శాస్త్రవేత్తలు. పెళ్లికి ముందు ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారు,  పెళ్లి తర్వాత కూడా తమ భాగస్వామిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఎందుకంటే.. ఇలా ఎక్కువమందితో   ఎఫైర్స్‌లో ఉండే వారికే వాటిలో ఉండే  లోటుపాట్ల గురించి బాగా తెలుస్తుంది. అలాగే ఎదుటివారిని   ఎలా ఆకర్షించాలి? అనేది    పదే పదే ఆలోచిస్తూ ఉంటారట. కాబట్టి.. వారు పెళ్లయ్యాక కూడా  ఇలాంటి పనులు  చేసే అవకాశాలు  ఎక్కువగా ఉంటాయట.ఈ అధ్యయనంలో.. అవతలివారు ఎందుకు తమ భాగస్వామిని మోసం చేయాలనుకుంటారు అనే  అంశాన్ని కూడా తెలుసుకున్నారు . ఒక బంధంలో అవతలి వ్యక్తి నుంచి తాను ఆశించిన ప్రేమ  దొరకకపోవడం, వారు దూరంగా ఉన్నారన్న భావన  కలగడంతో పాటు.. రిలేషన్ షిప్‌లో సరైన  ఆనందం లేకపోవడం వంటివన్నీ.. వేరే వ్యక్తి దగ్గరకు చేరేందుకు దారి చూపిస్తాయి. కానీ తమ భాగస్వామి కోసం తగినంత సమయాన్ని కేటాయించి..  వారితో అన్ని విషయాలు మాట్లాడే వారిలో ఇలాంటి గుణాలు తక్కువగా  ఉన్నాయట.  భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతూ.. వారితో ఆనందంగా ఉండేవారు అక్రమ సంబంధాల గురించి ఆలోచించే అవకాశం  తక్కువ అని ఈ అధ్యయనంలో బయట పడింది.

రిలేషన్ షిప్‌కి సంబంధించి నిపుణులు తెలియచేసిన  వివరాల ప్రకారం.. మీ భాగస్వామి మరో వ్యక్తి తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ,మీకంటే తన గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటే గనుక  మీ ఇద్దరి మధ్య  దూరం పెరిగిపోతోందని అర్థం. అయితే వేరే వారితో సంబంధాలు కొనసాగించినా.. వీటిని సాధ్యమైనంత త్వరగా మర్చిపోయి.. భాగస్వామితో జీవితాన్ని కొనసాగించేవారు కూడా చాలామంది ఉంటారట.ఎప్పుడో ఒకసారి అలా చేసారని వారిని మాటిమాటికి దెప్పిపొడవడం కూడా సరైన పని కాదని నిపుణులు తెలియచేస్తున్నారు. కానీ తన భాగస్వామిని లెక్కకు మించి మోసం చేసిన.. వ్యక్తుల విషయంలో మాత్రం తగినంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఇలాంటి పనులు చేయడం మానుకోలేరు  ఈ ప్రవర్తన కూడా వారి  జీవన విధానం లో ఒక  భాగం కనుక.. అటువంటి వారికి దూరమవడమే మంచిదని నిపుణులు  తెలియచేస్తున్నారు.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk