Food: చాలా మందికి తియ్యని పదార్థాలు తినడం అనేది ఇష్టమైన పని అని చెప్పాలి. కొందరు చాలా ఎక్కువగా తింటే మరికొంత మంది తక్కువ తింటారు. ఆ తియ్యదనం రావడం కోసం పంచదారను వాడుతుంటారు. అయితే తీపి కోసం పంచదార కంటే కూడా బెల్ల౦ వాడకం ఆరోగ్యానికి మంచిది అని తెలిసిచ్చేస్తున్నారు డాక్టర్ లు.
బెల్లంలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన శరీరానికి ఎక్కువ క్యాలరీలు చేరకుండా ఉండటం తో అధిక బరువు సన్నబడే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం గా బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట భోజనం పూర్తి అయ్యాక చిన్న బెల్లం ముక్క తింటే చాలా తేలికగా ఆహారం జీర్ణమవుతుంది. బెల్లం మన లివర్‌కు చాలా మేలు చేస్తుంది.
రోజూ చిన్న బెల్లం ముక్క తింటే లివర్‌లో ఉండే విష పదార్థాలు హానికర వ్యర్థాలు, బయటకు పోయి లివర్ శుభ్రంగా ఉండి.. కాలేయ సంబంధిత అనారోగ్యాలు రావని నిపుణులు తెలియచేస్తున్నారు. బెల్లంలో ఎక్కువగా పొటాషియం ఉండటంతో, అది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం గా ఉండేలా చేస్తుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉండి మన శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది.
గుండె జబ్బులు కూడా రావు. బెల్లం బ్లడ్ఫ్యూరిఫయర్లా పనిచేస్తుంది. దీన్ని తరచూ కొద్ది మొత్తంలో తీసుకుంటూ ఉంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని తెలియ చేస్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంతో పాటు, రక్తహీనతను తగ్గేలా చేస్తుంది. బెల్లం లో ఉండే సోడియం,పొటాషియం, శరీరంలోని యాసిడ్ స్థాయి క్రమపద్ధతిలో ఉండేలా చేయడం లో ముందుంటాయి.