న్యూస్

ఎట్టకేలకు కృష్ణంరాజు గురించి చెప్పిన డాక్టర్లు… నెలరోజులుగా అక్కడే ఉన్నారట!

Share

తెలుగు పరిశ్రమ దగ్గజాలలో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది తెలుగు చిత్ర సీమ. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు ఆయన తన శరీరాన్ని విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు నేటితో 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా ఇటీవల పని చేసిన సంగతి విదితమే. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఆయన మృతికి రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. ఆయన పలు ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

#image_title

అయితే పోస్టు కోవిడ్ సమస్యల కారణంగా… కృష్ణంరాజు మరణించారని ప్రస్తుతం వినబడుతోంది. తాజాగా కృష్ణం రాజు మృతికి సంబంధించి హెల్త్ బులిటెన్‌కు సంబంధించిన ప్రెస్ నోట్‌ను AIC ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఈ వయస్సులో డయాబెటిస్ మెల్లిటస్, కరోనరీ హార్ట్ డిసీజ్, క్రానిక్ హార్ట్ రిథమ్ డిజార్డర్ మరియు హార్ట్ డిస్‌ఫంక్షన్‌తో పోస్ట్ కార్డియాక్ స్టెంటింగ్ ఉన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా కాలుకి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని వైద్యులు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కన్నుమూసినట్టు పేర్కొన్నాయి.
#image_title

గుండె కొట్టుకునే వేగం విషయంలో చాలా కాలంగా ఆయన సమస్య ఎదుర్కొంటున్నట్టు వారు తెలిపారు. కృష్ణంరాజుకు రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగినట్టు కూడా తెలుస్తోంది. అలాగే, దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని వివరించారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Share

Related posts

Advocates murder case : లాయర్‌ల విధుల బహిష్కరణ ..సుమోటాగా తీసుకున్న హైకోర్టు

somaraju sharma

Husband : మీ భర్త గురించి ఇలా ఎప్పుడు మాట్లాడకండి!!

Kumar

Corona Effect: అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక నిర్ణయం..!!

somaraju sharma