NewsOrbit
న్యూస్

ఈ డాక్టర్ చెప్పింది వింటే కరోనా పై భయాలు అన్నీ పోతాయి..! ఇంత తేలికా?

కరోనా వైరస్ రోజు రోజుకి తన కోరలను విస్తరింపచేస్తూ ఉంటే ప్రజల్లో దానికి సంబంధించిన భయాందోళనలు ఎక్కువైపోయాయి. ఏ పని చేస్తే ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందా అని అంతా ఆందోళన చెందుతున్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వాలు లాక్ నుండి అన్ని మినహాయింపులు ఇచ్చేసిన తర్వాత జనాల్లో ఈ భయం రెట్టింపు అయింది. 

 

 

 

Coronavirus: Origin, symptoms, causes, treatment, precautions and ...

అయితే అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ అయిన మేరీలాండ్ కి చెందిన డాక్టర్ ఫహీమ్ యూనస్ అంటువ్యాధుల క్లినికల్ విభాగం లో సూపర్ స్పెషలిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆయన ఇందుకు సంబంధించి కొన్ని సలహాలు మరియు సూచనలు ఇచ్చి మన అపోహలను పోగొట్టారు.

 ముందుగా ఈ కరోనాతో భవిష్యత్తులో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉందని మనం తెలుసుకోవాలి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కరోనా గురించే ఆలోచన పెట్టుకొని అంతగా భయపడాల్సిన అవసరం లేదు.

 ఇక విపరీతంగా నీరు తాగడం వల్ల కానీ లేదా మరొక పద్ధతి వల్ల గానీ ఈ ప్రమాదకర వైరస్ ను చంపడాం కుదరదు. నీరు ఎక్కువగా త్రాగడం వల్ల టాయిలెట్ కు వెళ్లడం తప్పించి వైరస్ నుండి తప్పించుకునే అవకాశం మాత్రం లేదు.

 ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరియు కనీసం రెండు మీటర్ల దూరం పాటించడం వంటి నిబంధనల వలన మాత్రమే వైరస్ నుంచి తప్పించుకోవడం కుదురుతుంది.

 మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా అడుగులు వేయడం మంచిదే కానీ కరోనా రోగి లేని ఇంటినీ పదేపదే శానిటైజ్ చేయడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు.

 కార్గో ప్యాకేజీలు, పెట్రోల్ పంపులు, తోపుడు బండ్లు లేదా ఏటీఎం ల వలన కరోనా సంక్రమించే అవకాశమే లేదు.

 అదేవిధంగా ఫుడ్ ఆర్డర్ ద్వారా కూడా  వైరస్ సంక్రమించే అవకాశం లేదు.

 దాదాపుగా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ మరియు నోటి నుండి వచ్చే తుంపరలు లేదా దగ్గినపుడు వచ్చే జల్లు నుండి మాత్రమే కరోనా ఒకరి నుండి ఒకరికి సోకే అవకాశం ఉంది.

 రుచి కోల్పోవడం మరియు వాసన తెలియకపోవడాం వంటివి కరోనా లక్షణాలని అనవసరంగా భావించాల్సిన అవసరం లేదు. అలర్జీలు మరియు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్ల తో కూడా ఈ లక్షణాలు వస్తాయి.

 బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ప్రతీ సారి బట్టలు ఉతకడం అనవసరమైన ప్రక్రియ. అలాగే వచ్చిన ప్రతి సారి అత్యవసరంగా స్నానం చేయవలసిన అవసరం కూడా లేదు.

 ఇది గాలి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి తోటలలో, పార్కులలో తిరగవచ్చు. అదీ కాకుండా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల గాలి కూడా కలుషితంగా కాలేదని చెబుతున్నారు.

 వైరస్ బారిన పడకుండా యాంటీబ్యాక్టీరియల్ సోప్ లను ప్రత్యేకంగా కొనవలసిన అవసరం లేదు. బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్ ను తీసుకువెళ్ళడం…. ఇంటిలో మనం మామూలుగా వాడే సబ్బులను వాడితే సరిపోతుంది.

 తిండి విషయంలో అనవసరమైన కంగారు అవసరం లేదు. అంతేకాకుండా వేసుకునే చెప్పులు లేదా షూస్ ద్వారా కూడా వైరస్ వచ్చే ప్రమాదం లేదు. అనవసరమైన విషయాలకు కంగారు పడకండి అని వైద్యులు చెబుతున్నారు.

 జ్యూస్ ల ద్వారా అల్లంవెల్లుల్లి ద్వారా కరోనా ను అరికట్టవచ్చు అంటే ఇప్పటికే ప్రపంచంలో కరోనా ఎప్పుడో నశించేది. అవి కేవలం రోగనిరోధక శక్తిని పెంచుతాయి కానీ దానివల్ల వైరస్ పై ఎటువంటి ప్రభావం ఉండదు.

 మాటిమాటికి మాస్కులు ధరించడం వల్ల శరీరంలోకి చేరవలసిన ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. కాబట్టి కేవలం జనసాంద్రత ఉన్న చోట మాస్క్ ఉపయోగించడం మంచిది. ఎవరూ లేనప్పుడు మామూలుగానే తిరగవచ్చు.

 కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలని తింటూ డైట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

author avatar
arun kanna

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk