NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nellore TDP: అచ్చెన్నాయుడుకైనా ఈ నెల్లూరు టిడిపి నేత కున్నంత కమిట్మెంట్ ఉందా?అందరూ అవాక్కయ్యేలా ఆయన చేసిన పనేమిటి?

Nellore TDP: ఆవేశంలో ప్రతిజ్ఞలు చేయటం వేరు. దాన్ని ఆచరణలో పెట్టడం వేరు.బడారాజకీయ నేతలే ఇలాంటి విషయాల్లో మాటమీద నిలబడరు.ఉదాహరణకు అగ్ర నిర్మాత,అందరికీ తెలిసిన బండ్ల గణేష్ నే తీసుకుందాం.

Does Atchannaidu have commitment like This Nellore Leader towards TDP
Does Atchannaidu have commitment like This Nellore Leader towards TDP

కాంగ్రెస్ లో చేరి ఆ ఊపు మీదున్న సమయంలో బండ్ల గణేష్ 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాకుంటే తాను మెడ కోసుకుంటానని భీకర ప్రతిజ్ఞ చేశారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బండ్ల గణేష్ తూచ్ అన్నాడు.ఒక బండ్లగణేషే కాదు ..అనేక సందర్భాల్లో అన్ని పార్టీల నేతలు కూడా ఇలా సవాళ్లు విసరడం. తర్వాత సర్దుకోవటం మామూలే.కానీ ఒక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు మాత్రం ఎన్నికల సమయంలో తాను చేసిన సవాల్ కు కట్టుబడి అర గుండు,అర మీసం చేయించుకోవడం అత్యంత అరుదైన విషయం.రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Nellore TDP: చెప్పిందే చేసిన టిడిపి నేత శ్రీనివాస్

రెండు రోజుల క్రితం నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికల్లో 49,50 డివిజన్ల టీడీపీ ఇన్చార్జిగా కప్పిర శ్రీనివాస్‌ వ్యవహరించారు.ఎన్నికల సమయంలో శ్రీనివాస్ ఈ రెండు డివిజన్లలో టీడీపీ కనుక ఓడిపోతే తాను అరగుండు, అరమీసం చేయించుకుంటానని సభాముఖంగా ప్రకటించారు.బుధవారం ఎన్నికల ఫలితాలు రాగా వైసిపి క్లీన్ స్వీప్ చేసింది.ఒక్క డివిజన్ కూడా వైసీపీకి దక్కలేదు.ఈ ఫలితాల అనంతరం ఆ జిల్లాలోని టిడిపి అగ్రనేతలే ముఖం చాటేశారు.కాని శ్రీనివాస్ మాత్రం మాట మీద నిలబడ్డారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటకే ఆయన అరగుండు, అరమీసం చేయించుకొని ప్రజల మధ్యకు వచ్చేశారు.ఈ రెండు డివిజన్లలో గెలవటానికి వైసిపి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఆయన చెప్పారు.అయినా టిడిపి ఓడిపోయింది కాబట్టి తను అరగుండు, అరమీసం చేయించుకున్నట్లు తెలిపారు.అంతేగాక ఆయన ఈ సందర్బంగా ఇంకో ప్రతిజ్ఞ కూడా చేశారు.

జగన్ పోవాలి.. బాబు రావాలి..!

కాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు సర్కారు వచ్చే వరకు తాను అరగుండు అరమీసంతోనే ఉంటానని శ్రీనివాస్ ప్రకటించారు.జగన్ పోవాలి ..బాబు రావాలి అన్న నినాదం రాసిన పలకను మెడలో వేసుకొని ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు.సోషల్ మీడియాలో శ్రీనివాస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.టిడిపి పట్ల శ్రీనివాస్ కమిట్మెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు.జపాన్ సునామీ లో కూడా టిడిపి ఇంకా మనుగడ సాగిస్తోందంటే శ్రీనివాస్ లాంటి అంకితభావం ఉన్న నేతలే కారణమని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju