NewsOrbit
Featured న్యూస్

సర్వ రోగాలకు సీబీఐ చికిత్స..! సీబీఐ సక్సెస్ రేటు తెలుసా..??

“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్రైమ్ ప్రతినిధి

సీబీఐ అంటే ఏంటి..? వామ్మో సీబీఐ..! అనేంత పెద్ద పదం, పెద్ద వ్యవస్థ, పెద్ద దర్యాప్తు సంస్థ…! అటువంటి విభాగం ఇటీవల ఏపీలో తరచుగా వినిపిస్తుంది. తరచూ కనిపిస్తుంది. కీలకమైన ప్రతీ కేసుకి దానికే లింకు కడుతూ.., లింకులు లాగాలంటూ అప్పగిస్తున్నారు. ఇది మంచిదేనా..? రాష్ట్రంలో పోలీసులు ఛేదించలేకపోతున్నారా..? నమ్మకం సడలుతుందా..? సీబీఐ మాత్రమే ఈ కేసులకు పరిష్కారమా అనేది చూద్దాం..!!

“మంది ఎక్కువ అయితే మజ్జిక పలచన” అనేది సామెత.. ఇప్పుడు సీబీఐ పరిస్థితి దాదాపు ఇలాగే అవుతోంది… ఏదైనా సంఘటన జరిగినపుడు.., విమర్శలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ వైపు చూస్తోంది… తన తప్పు లేదు అని నిరూపించుకోవడానికి సీబీఐకె కీలక కేసులు అప్పగిస్తోంది.. అప్పగించడంలో తప్పు లేకున్నా ప్రతి కేసును సీబీఐకి ఇవ్వడం ద్వారా రాష్ట్ర పోలీసు పనితీరుపై నమ్మకం సడలే పరిస్థితి ఏర్పడుతుంది…!! దీంతో పాటు సీబీఐ దర్యాప్తులో నాణ్యత లోపిస్తోంది…!! గంప గుత్తగా నమోదవుతున్న కేసులను సీబీఐ కూడా సరైన దర్యాప్తు లేకుండానే ముగిస్తోంది.


చిన్నవి పెద్దగా చూస్తూ ..!!

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 16 నెలల కాలంలో 5 కేసులను సి.బి.ఐకు అప్పగించారు…. దీనిలో విశాఖ వైద్యులు డాక్టర్ సుధాకర్ కేసును, ముఖ్యమంత్రి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హైకోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి అప్పగించింది… అమరావతి భూముల విషయంలో గత ప్రభుత్వం భారీ కుంభకోణం చేసిందని ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిందని ఆరోపిస్తూ మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆ కేసును సిబిఐకి అప్పగించారు… తరువాత సుగాలి ప్రీతి హత్య కేసు, తాజాగా అంతర్వేది రథం కాలిపోయిన అంశాన్ని సీబీఐకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…!
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన ఈ 3 కేసులను రాష్ట్ర పోలీసులు పరిష్కరించవచ్చు.. ఇవి చాలా చిన్న విషయాలు. ప్రతి కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తే వీటిని కొద్ది రోజుల్లోనే పరిష్కరించే వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా ప్రతి కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా కేసుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. కేసుల నమోదు, విచారణ, సీబీఐ స్టైల్ విచారణ తీరుతో జాప్యం జరుగుతుంది.

 

అసలు జరిగిందేమిటి..??

విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు సిబిఐ దర్యాప్తు చేయడం ద్వారా బయట పడే అంశాలు ఏమి కొత్తగా లేకున్నా కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించక తప్పదు. ఈ కేసులో స్థానిక పోలీసులు అతి చేయడం.., సరైన స్పందన లేకపోవడమే హైకోర్టు వరకు ఈ విషయం వెళ్ళింది. విషయం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ సి డి, పోలీస్ స్టేషన్ జీడీ లో దీన్ని ఎంటర్ చేసి “న్యూసెన్స్” కేసు కింద వెంటనే వైద్యుని స్టేషన్ బెయిలు ఇచ్చి పంపిస్తే ఇంతవరకు సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు ఈ కేసులో సిబిఐ కొత్తగా నిందితులు ఎవరు అనేది తేలాల్సి లేకున్నా వివాదానికి కారణాలు తెలపాల్సి ఉంది. కుట్ర కోణం కూడా ఉందేమో అంటూ సీబీఐ అనుమానించడం పెద్ద తలనొప్పి వ్యవహారమే. పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది.

సుగాలి ప్రీతీ కేసు..! మంచిదే..!!

ఇక సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇవ్వడం మంచి పరిణామమే అయినా స్థానిక పోలీసుల దర్యాప్తును ఇది ప్రశ్నించినట్లు అయింది. సుగాలి ప్రీతి కేసు లో జగన్ ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ వేస్తే… బాధితుల అనుమానాలను నివృత్తి చేస్తే… నిజానిజాలు శాస్త్రోక్తంగా బయటికి తీస్తే జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. ఆమె తల్లికి నమ్మకం కలిగించడం కోసం, రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గుతారనే అనుమానంతో సీబీఐ కి అప్పగించారు. ఈ విచారణ ఇంకా మొదలు కాలేదు.

* మంత్రివర్గ సమావేశంలోనే అమరావతి భూములు ఇన్ సైడ్ ట్రేడింగ్ విషయంలో ప్రభుత్వం సిబిఐ విచారణకు మద్దతు పలికింది.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఈ విషయంలో బలమైన ఆరోపణలు ఉన్నట్లే ఆధారాలు ఉండాలి.. ఇవన్నీ ఆర్థికాంశాలు కావడంతో నిందితులను వెంటనే జాబితాలో చేర్చడం కుదరదు.. వారిపైన ఎఫ్ ఐ ఆర్ నమోదుకు వెంటనే అవకాశం ఉండదు… ఈ విషయంలో సీబీఐ కు ప్రభుత్వం తగిన ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది.

సి బి ఐ సక్సెస్ రేటు ఎంత..??

ఇక్కడ మనం చూడాల్సిన మరో కీలక విషయం ఉంది. సిబిఐ కేసు అప్పగించిన వెంటనే దానిలో నిజానిజాలు బయటకు వస్తాయని నిందితులకు శిక్షలు పడతాయని గ్యారెంటీ లేదు. ముందుగా సి.బి.ఐ సిబ్బంది లేమితో ఇబ్బంది పడుతోంది. సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు. సిబిఐ కు దేశవ్యాప్తంగా ఉన్న 10 జోన్లలో 28 శాతం ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 7274 సిబ్బంది కావాల్సి ఉండగా 5658 మంది మాత్రమే ఉన్నారు… దీనికి తోడు ప్రతి ఏడాది సీబీఐకి అప్పగించాలి కేసులు సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 420 కేసులను సిబిఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే… ఈ ఏడాది ఆగస్టు కె 320 కేసులను నమోదు చేసింది. సి.బి.ఐ నమోదు చేసే ప్రతి కేసు దర్యాప్తును ఒక డీఎస్పీ స్థాయి అధికారి వారి బృందం ఆధ్వర్యంలో జరుగుతుంది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు తోనే కాదు కోర్టులో తగిన సాక్ష్యాలు ఆధారాలు చూపించి నేరస్తులకు శిక్ష పడేలా కూడా సిబిఐ పక్కాగా చార్జిషీట్లు వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో సిబిఐ తడబడుతోంది.

శిక్షలు పడుతున్నాయా..? లెక్కలు ఏం చెబుతున్నాయి..??

దేశవ్యాప్తంగా సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సగటున 65 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.. 2011 లో 67 శాతం… 2010లో 79.08… 2009 లో 60.5…. 2008లో 66.8… 2007లో 67.7 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నట్లు రికార్డు ఉంది… అంటే సీబీఐ విచారణ చేసినంత మాత్రాన ఈ కేసులో నిందితులు వారికి పడే శిక్షలు అంతంత మాత్రమే అర్థమవుతుంది. సిబిఐ ఒక స్వతంత్ర సంస్థ.. దానికి సిబ్బంది నియమించుకునే అధికారం ఉన్న నిధులు తక్కువగానే ఉంటాయి… దీంతో వివిధ స్థాయిలోని పోలీసులను డిప్యుటేషన్ పద్ధతిలో సిబిఐ నియమించుకుంటుంది… దీంతో డిప్యూటేషన్ కాలం అయిపోగానే అధికారులు తమ శాఖకు తిరిగి వస్తూ ఉంటారు… దింతో ఖాళీలు అలాగే ఉండిపోతాయి.

antarvedi

రాష్ట్ర పోలీసులకు స్వతంత్రత ఇవ్వాలి..!!

రాష్ట్ర పోలీసులకు స్వతంత్రత ఇస్తే సిబిఐ కానీ అత్యంత అద్భుతమైన దర్యాప్తును వారు చేపట్ట గలరు. కేసుల్లో ప్రజాప్రతినిధులు రాజకీయ జోక్యం తగ్గిస్తే, రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే చాలా కేసులు కోర్టులో బలంగా నిలబడతాయి. స్థానిక పోలీసుల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.. ఇలా కాకుండా ప్రతి కేసును సీబీఐకి అప్పగించగా ద్వారా రాష్ట్ర పోలీసుల పనితీరు మీద ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. అలాగే విపక్షాలు సైతం ప్రతి కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆందోళన చేయడం పరిపాటి అవుతుంది. అత్యంత అరుదైన కీలకమైన కేసుల్లోనే సీబీఐకు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సీబీఐ దర్యాప్తులో సైతం నాణ్యత పెరుగుతుంది.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!