NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని…కోరి క‌ష్టాలు తెచ్చుకుంటున్నారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని దూకుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అధికార పార్టీని ఆయ‌న ఓ రేంజ్‌లో స‌మ‌ర్థిస్తుంటారు.

విప‌క్ష టీడీపీపై విరుచుకుప‌డుతుంటారు. అయితే, ఆయ‌న‌కు ఓ షాక్ త‌గిలింది. కొడాలి నానిపై సీపీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీపీకి ఫిర్యాదు అందింది.

నాని పేరు మార్చేశార‌ట‌
తెలుగుదేశం పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో పాటు చంపేస్తామన్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు సీపీకి ఫిర్యాదు చేశారు. అనంత‌రం వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు కొంతమంది సభ్యత, సంస్కారాలు మరిచి వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో విజయవాడలో ఉన్న రౌడీయిజాన్ని మరోసారి గుర్తుకు తెస్తున్నారని విరుచుకుప‌డ్డారు. మంత్రి కొడాలి నాని తరచుగా బుద్ధి లేకుండా, అసభ్యంగా, జ్ఞానం లేకుండా మాట్లాతుంటారని వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. ఆయనను బూతుల మంత్రిగా ప్రజలు పేరుపెట్టి ఆ విధంగా పిలుస్తున్నారని విమ‌ర్శించారు.

వాళ్లిద్ద‌రితో క‌లిసి నాని….
త‌న ఇద్దరు సహచరులు మైలవరం, గన్నవరం ఎమ్మెల్యేలను చెరో పక్కన పెట్టుకుని  వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి చంద్రబాబుపై ఇష్టానుసారంగా మంత్రి కొడాలి నాని మాట్లాడారని టీడీపీ నేత అభ్యంత‌రం తెలిపారు. కొడాలి నాని బూతులు వింటే ఆయన తల్లిదండ్రులు సిగ్గుతో తలవంచుకుంటారని అన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరరావు గురించి నాని మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేవిగా ఉన్నాయని అన్నారు. శవాన్ని పట్టుకుని చంద్రబాబుగారు ఊరేగుతారని, లారీతో తొక్కిస్తానని, తానే తొక్కిస్తానని, చెప్పను తానే చేసి చూపిస్తానని మాట్లాడారని మండిప‌డ్డారు. “ప్రత్యర్థులను భయపెడతారా? మీ ప్రభుత్వం తప్పుచేస్తోందని చెబితే లారీలతో తొక్కిచ్చేస్తారా? ప్రతిపక్షంగా మా బాధ్యతను మేం నెరవేరుస్తుంటే చంపేస్తారా, లారీలతో తొక్కిస్తారా? మంత్రిగా కొనసాగే నైతిక హక్కు కొడాలి నానికి లేదు. మీరు మంత్రా, వీధి రౌడీనా? సీఎం తేల్చాలి` అని డిమాండ్ చేశారు.

నానికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది ఇందుకేన‌ట‌
“ముఖ్యమంత్రి జ‌గ‌న్ ..మీ మంత్రిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? చంద్రబాబును ఎంత బాగా తిడితే అంత చంకలు గుద్దుకుంటారు. అందుకే నానికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి అర్హత లేని వ్యక్తికి ఇచ్చారు. చంద్రబాబు గారిని తిట్టడానికే మంత్రి పదవి ఇచ్చారు. జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో కొడాలి నాని చెప్పలేరు. అలాంటి అజ్ఞాని చంద్రబాబును తిట్టడానికే పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిపై చర్యలు తీసుకోలేదు కాబట్టి చట్టాన్ని ఆశ్రయించాం. పోలీస్ కమిషనర్ ను కలిసి పిటిషన్ ఇచ్చాం. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. యాక్షన్ తీసుకుంటామని సీపీ గారు చెప్పారు. మంత్రి కొడాలి నానిని ముఖ్యమంత్రి భర్తరఫ్ చేయాలి.“ అని టీడీపీ నేత‌లు డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నానిని ముఖ్యమంత్రి భర్తరఫ్ చేయాలని, టీడీపీ నేత‌లు చేసిన డిమాండ్‌పై, పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju