సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ ను దక్కించుకుని చాలా కాలంగా నెం.1 హీరోయిన్ గా దక్షిణ సినీ పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్ నయనతార. ఆమె అదృష్టానికి ఇప్పటికి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోతుంటారు. ఆమెకు గతంలో మూడు సార్లు ప్రేమలో విఫలం అయ్యినందుకు జనాల్లో ఆమెకు నెగటివిటీ పెరిగి ఉండాలి. కాని ఈమె విషయంలో అది పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమెపై ప్రేక్షకుల్లో అభిమానం మరింత పెరుగుతూ వస్తుంది.
సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తరువాత తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఇప్పటికే నయనతార టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించారు. ఇంకొకవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులకు తన సత్తా చూపించారు. ఇంతకీ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా ఈమెకు ఇంతటి అదృష్టంకు గల కారణం ఆమె చేతికి ఉన్న ఆరవ వేలు అంట.
నయనతార సినిమాలలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె చేతికి ఉన్న ఆరవ వేలు మనకి కనిపిస్తుంది. ఇలా ఆరు వేళ్ళు ఉన్నవారు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆరు వేళ్ళు ఉన్నవారికి చాలా అదృష్టం ఉంటుంది అని మన నిత్య జీవితంలో తరచు వింటూ ఉంటాం. నయనతార కు ఇంతటి అదృష్టం ఆ ఆరవ వేలు కారణంగానే అంట.
బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు పొందిన హృతిక్ రోషన్ కు కూడా ఆరు వేళ్ళు ఉంటాయి. ఆయన తన కెరీర్ లో ఎంత సక్సెస్ అయ్యారో మనం చూసాం. ఇప్పుడు నయనతార విషయంలో కూడా ఆమెకు ఉన్న ఎక్ట్సా వేలే ఆమెను ఇన్నాళ్లుగా సూపర్ స్టార్ గా నిలిపిందేమో అంటన్నారు నెటిజన్స్.