NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ తెలంగాణా మినిస్టర్ పై కోపంగా ఉన్న కే‌సి‌ఆర్ – ఛాంబర్ లో క్లాసు ??

తెలంగాణ‌ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ వ్య‌వ‌హార శైలి ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న త‌ల‌సాని ఎందుకిలా చేస్తున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ముఖ్య‌నేత‌గా ఉన్న ఆయ‌న క‌రోనా విషయంలో లైట్ తీసుకుంటున్నట్లు క‌నిపిస్తోందని అంటున్నారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం అసంతృప్తిగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సిద్దిపేట‌లోనే ఇలా జ‌రిగింది?
తాజాగా సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావుతో క‌లిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కృత్రిమ గర్భధారణ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్‌లో విత్తన చేప పిల్లలను వదిలారు. గజ్వేల్‌లో టీఎన్జీవో భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎక్క‌డ కూడా మాస్క్ ధ‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, బాధ్య‌తాయుత‌మైన మంత్రిగా ఉన్న త‌లసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఇంత బ‌హిరంగంగా జ‌రిగిన కార్య‌‌క్ర‌మాల్లో మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రిగా ఉన్న, టీఆర్ఎస్ ముఖ్య నేత హ‌రీశ్ రావు సైతం మాస్కు ధ‌రించారు. అయితే, పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న హైద‌రాబాద్‌లో నివ‌సిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో భారీగా కేసులు…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 1.11 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3018 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 780 కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో 95, జీహెచ్ఎంసి పరిధిలో 475, జగిత్యాలలో 100, కామారెడ్డిలో 76, కరీంనగర్ లో 127, ఖమ్మంలో 161, మహబూబాబాద్ లో 60, మంచిర్యాలలో 103, మేడ్చల్ లో 204, నల్గొండలో 190, నిజామాబాద్ జిల్లాలో 136, పెద్దపల్లిలో 85, రాజన్న సిరిసిల్లలో 69, రంగారెడ్డిలో 247, సిద్ధిపేటలో 88, సూర్యాపేటలో 67, వరంగల్ రూరల్ లో 61, వరంగల్ అర్బన్ లో 139 కేసులు నమోదయ్యాయి.

author avatar
sridhar

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?