Dog Birthday: పెంపుడు జంతువుల పట్ల యజమానులు తమ ప్రేమను ఎప్పుడూ చాటుతూనే ఉంటారు. అయితే కొందరు వాటిని తమ కుటుంబంలోని ఒక సభ్యుడిగా ట్రీట్ చేస్తారు. వాటికి డ్రెస్ తొడగటం, తమతో పాటు అన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం, ఇంకా వాటికి పార్టీలు నిర్వహించడం కూడా చేస్తారు. అయితే తాజాగా ఒక కర్ణాటక వ్యక్తి తన కుక్క పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఏకంగా వంద కిలోల కేక్ కట్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు, నాలుగు వేల మందికి అన్నదానం చేసి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Dog Birthday: గ్రాండ్ గా బర్త్‌డే
వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావికి చెందిన శివప్ప ఎల్లప్ప అనే వ్యక్తి ఒక కుక్కను చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. దీనికి క్రిష్ అని క్యూట్‌గా నామకరణం కూడా చేశాడు. చిన్న కుక్కపిల్లగా ఉన్న సమయం నుంచి దాన్ని ఎంతో గారాబంగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే కుక్క పుట్టినరోజు వచ్చింది. దీంతో శివప్ప తన కుక్క బర్త్ డేని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. బంధు మిత్రులతో పాటు ఊరిలోని ప్రజలందరినీ పార్టీకి ఆహ్వానించాడు. అనంతరం ఏకంగా 100 కిలోల కేక్ తీసుకొచ్చి కట్ చేశాడు.
వైరల్ అవుతున్న వీడియోలో క్రిష్ అనే కుక్కకి కేక్ తినిపించడం చూడవచ్చు. ఆ తర్వాత వందలాది మందికి అన్నదానం చేస్తూ ఉండటం కూడా గమనించవచ్చు. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియాపై మీరు కూడా ఓ లుక్కేయండి.