మన అందరికి మనుషులు ఆత్మహత్యలు చేసుకునే సూసైడ్ స్పాట్స్ గురించి తెలుసు, ఇంతకముందు విన్నాం. కానీ జంతువులకు కూడా ఓ సూసైడ్ స్పాట్ ఉందంటే మీరు నమ్ముతారా? అవును నిజగానే అలాంటి ఒక జంతువుల సూసైడ్ స్స్పాట్ స్కాట్లాండ్ లో ఉంది. ఆ సూసైడ్ స్పాట్ స్కాట్లాండ్ లోని ఒక బ్రిడ్జి.
స్కాట్లాండ్లో ఏటా కొన్నికుక్కలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నాయి. డంబార్టన్ దగ్గరలో ఉన్న మిల్టన్ గ్రామంలో ఒక బ్రిడ్జి ఉంది. ఈ ప్రాంతం కుక్కలను ఆత్మహత్య చేసుకునేలా ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు సుమారు 600 కుక్కలు ఈ బ్రిడ్జిపై నుంచి దూకి చనిపోయాయి.
ఆ బ్రిడ్జి పేరు ఓవర్టన్. 1859లో దీని నిర్మాణం జరిగింది. తొలిసారిగా 1950ల్లో ఇక్కడ ఓ కుక్క సూసైడ్ చేసుకోవడాన్ని గుర్తించారు. ఈ బ్రిడ్జి 50 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడకు వచ్చే కుక్కలు ఒకే స్పాట్ దగ్గరి నుంచి కిందకి దూకుతునట్లు చెబుతారు.
కొన్ని సార్లు కుక్కలకు దెబ్బలు మాత్రమే తగులుతాయి అవిచనిపోవు.. అలాంటి కుక్కలు మళ్లీ బ్రిడ్జిపైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంటాయట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మిస్టరీ గానే మిగిలిపోయింది. స్థానికులు మాత్రం అక్కడ దుష్ట శక్తులు ఉన్నట్లు భావిస్తారు.
స్థానికులు చెప్పే కథ ఏమనగా 1994లో ఓ వ్యక్తి తన కుమారుడిని బ్రిడ్జిపై నుంచి కిందు తోసి చంపేశాడు. కొన్ని రోజుల తర్వాత అతను కూడా అక్కడి నుంచి దూకి చనిపోయాడు. కాబట్టి అక్కడ దెయ్యాలు తిరుగుతాయని స్థానికులు నమ్ముతున్నారు. అక్కడికి వచ్చే వారు తమ కుక్కలపై ఒక కన్నేసి ఉంచాలని బోర్డులు కూడా పెట్టారు.