NewsOrbit
న్యూస్

Save Money: ఇలా చేసారంటే మీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి!!

Save Money: డబ్బును పొదుపు చేసుకోవాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాల్సిందే..లేదంటే చివరకు ఖర్చులు తప్ప మిగిలేది ఏమి ఉండదు. డిస్కౌంట్లు లేదా రిబేట్ ఆఫర్లు ఉన్నప్పుడు  షాపింగ్ చేయడం  వలన  ఎంతో కొంత డబ్బు ఆదా   చేయగలుగుతాము. అయితే ఈ ఆఫర్స్ కోసం బ్రాండ్ వస్తువులు అమ్మే పెద్ద పెద్ద మాల్స్ లేదా షాపింగ్ సెంటర్లు  ఎంచుకోవాలి.  అంతే తప్ప ఆఫర్ ఇచ్చే ప్రతి షాపును  నమ్మకూడదు. కొన్నిసార్లు బ్రాండ్ వస్తువులు  సంవత్సరం చివర్లో  ప్రత్యేక డిస్కౌంట్ తో సేల్ చేస్తుంటారు.   ఆ సమయంలో షాపింగ్‌కు  వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ డబ్బు సేవ్ చేసుకోవచ్చు

.

కొందరికి షాపింగ్ చేయడం  అనేది ఒక హాబీ గా ఉంటుంది. అందుకే  అలా  షాపింగ్ చేసేటప్పుడు.. ఏ వస్తువులు కనబడితే  ఆ వస్తువును వెంటనే  కొని తీసుకొచ్చేస్తారు. ఇది ఇప్పుడు అవసరమా ?అస్సలు అవసరమా ?అని ఏమాత్రం ఆలోచించరు
ఈ క్రమంలో అవసరం  లేని అనేక  వస్తువులు కొనుగోలు  చేసేస్తుంటారు.  మీరు   డబ్బును ఆదా చేయాలనుకుంటే మాత్రం , ఇలాంటి హాబీలు  మానుకోవలసి ఉంటుంది. మీకు అవసరమైన వస్తువుల  లిస్ట్ తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా మీ బడ్జెట్ వేసుకుని ఆ   ప్రకారం  కొనండి.


షాపింగ్ కోసం మీరు ఒక ప్రత్యేకమైన బడ్జెట్  ను తీసి పక్కన పెట్టుకోండి.  ఈ క్రమంలో మీరు ఒక నెలలో షాపింగ్  చేయకపోతే ,ఆ డబ్బును  పిగ్గీ బ్యాంకు లో  వేసుకోండి. అలాగే మీరు వేసుకునే బడ్జెట్ కూడా  సరిగ్గా  ఉండాలి.
కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వస్తువు ధర ఒక్కో షాపులో..  వేరు వేరు గా ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ ప్రభావం వల్ల కూడా ఈ ధరలు  మారుతుంటాయి. అందుకే ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు  దాని రేట్ ని  ఆన్‌లైన్‌లో కూడా    చెక్ చేసుకుంటే మంచిది. ఈ పద్ధతి బ్రాండ్ వస్తువుల తో పాటు , ఆభరణాలు లాంటి వాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏమైనా కొనుక్కునే ముందు ఒకటికి రెండు సార్లు  ధరలు చెక్ చేసుకోవడం మంచిది.

సూపర్ మార్కెట్‌లో సామాన్లు కొనడానికి వెళ్తున్నాం అంటే మనచేతిలో కచ్చితంగా లిస్ట్ ఉండి తీరాల్సిందే అని నియమం పెట్టుకోవాలి. దాని కోసం ముందే లిస్టు రాసుకోవడం మంచిది.  లేకపోతే మనకు అవసరం లేని పదార్థాలన్నింటిని   కొనేస్తారు. అలాంటి చోట్ల  వస్తువులు  చూడటానికి కొత్తగా కనిపిస్తాయి. కనుక అవసరమున్నా.. లేకపోయినా మనకు వాటిని  కొనాలని అనిపిస్తుంది.    కనుక ముందు లిస్ట్ తయారు చేసుకుని  వెళ్లడం వల్ల.. అవసరమైనవి మాత్రమే  కొనుక్కుని బయట పడవచ్చు.

చర్మ  రక్షణ కోసం     ఉత్పత్తులు  వాడటం అనేది మంచిదే    కానీ వాటి కోసం మరీ ఎక్కువ ఖర్చు చేయడం అనేది సరికాదు. లగ్జరీ ఉత్పత్తులు వాడే  ముందు.. తక్కువ ధరలో కొనగలిగే  బ్రాండ్లను ఉపయోగించడం బెస్ట్. కొన్నిసార్లు అవి కూడా లగ్జరీ ఉత్పత్తుల మాదిరి    సమాన ఫలితాన్ని ఇస్తాయి .  మరీ ఖరీదైన ఉత్పత్తులు   కూడా మనకు అవసరం లేని వై    ఉండచ్చు. అందుకే వాటి గురించి ఎక్కువగా తెలుసుకుని    మీ చర్మతత్వానికి సరిపడే ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?