Pregnant: ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకుని ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వ్యాయామం చేయవచ్చు. వ్యాయామం వల్ల శరీర బరువు అదుపులో ఉండటం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. డెలివరీ టైం లో శరీరం శ్రమను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు శరీరాన్ని సిద్ధం చేయడం కోసం ముందు నుంచే శరీరానికి వ్యాయామ రూపం లో శ్రమని అలవాటు చేయాలి.
ఇక వ్యాయామం చేసేటప్పుడు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి .
అసలు మీ పరిస్థితి వ్యాయామం చేయడానికి అనుకూలమా కాదా అనేది ముందుగా డాక్టర్ ని అడిగి తెలుసుకోండి..
వ్యాయామం చేస్తున్నప్పుడు పొట్టలో నొప్పి, బ్లీడింగ్, కళ్లు తిరగటం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కలవాలి.
కింద పడిపోయే ప్రమాదం ఉన్న యోగాసనాల జోలికి వెళ్ళవద్దు. ఇలాంటి వ్యాయామం కూడా చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్ వారికీ అత్యుత్తమ వ్యాయామం అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలం నడకే! డెలివరీ ముందు రోజు వరకూ కూడా వాకింగ్ చేసుకొవచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు కూడా బాగా కదిలిస్తూ నడవడం అనేది చాలా మంచిది.
మరీ మెల్లగా కాకుండా కొద్దిగా గుండె వేగం పెరిగి, చెమటలు పట్టేంత స్పీడ్ గా నడవాలి .
ప్రతి రోజూ అరగంట పాటు నడక కు కేటాయించడం మంచిది.అప్పటివరకూ నడక అలవాటు లేకపోతే మాత్రం మొదట 10 నిమిషాలు గా మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
యోగాలో ఉన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లు చేయడం అలవాటు చేసుకోవాలి . ఊపిరి పీల్చి వదిలే ఈ పద్ధతి పురిటి నొప్పులు వచ్చినప్పుడు తేలిక డెలివరీ అవడానికి ఉపయోగపడుతుంది.యోగా చేయడం వల్ల రక్తపోటు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది.యోగా కూడా డెలివరీకి ముందు రోజు వరకు చేయవచ్చు.కాళ్లు పైన, తల కింద ఉంచి చేసే ఆసనాలు వేయకుండా ఉండడం మంచిది. నీటిలో యోగా చేయడం, ఈత కొట్టడం కూడా చేయవచ్చు.