న్యూస్

Dolo 650 టాబ్లెట్ హానికరమా? డాక్టర్లు లంచాలు తీసుకొని బలవంతంగా సజెస్ట్ చేస్తున్నారు? 

Share

డోలో 650కి వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది.
డోలో 650కి వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది.

Dolo 650 అనగానే అందరికీ గుర్తొచ్చేది టాబ్లెట్. డోలో-650 ఔషధం అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తరగతి క్రింద వస్తుంది. ఇది సాధారణంగా ఒళ్ళు నొప్పులు, జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డోలో 650 టాబ్లెట్‌లో జ్వరాన్ని తగ్గించే యాంటిపైరేటిక్ పదార్థం అనేది ఉంటుంది. యాంటిపైరేటిక్స్ కారణంగా హైపోథాలమస్ ఉష్ణోగ్రతలో ప్రోస్టాగ్లాండిన్-ప్రేరిత పెరుగుదలను భర్తీ చేస్తుంది అలాగే ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది, ఫలితంగా జ్వరం తగ్గుతుంది. 

డాక్టర్లు లంచాలు తీసుకొని బలవంతంగా Dolo 650 టాబ్లెట్ సజెస్ట్ చేస్తున్నారు?

అందుకే మన ఇండియాలో ఈ డ్రగ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. సగటు మానవుడు అనేవాడు ఈ డ్రగ్ వాడకుండా ఉండదు అనేది ఓ సర్వే. అంతవరకూ బాగానే వుంది కానీ.. అసలు ఈ టాబ్లెట్ అంత అవసరమా? ఇది అవసరం వున్నా, లేకున్నా డాక్టర్లు తమ పేషేంట్లకు సజెస్ట్ చేస్తున్నారని ఇపుడు ఓ వాదన బలంగా వినబడుతోంది. ఇక కరోనా తర్వాత ఈ డోలో 650 యూసెజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలో కాస్త జ్వరంగా ఉంటే చాలు ఈ టాబ్లెట్ వేసుకోవడం జరిగేది.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆప్ సర్కార్

ఇక అప్పటినుండి ఈ టాబ్లెట్ వేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో డోలో 650 ఉండాల్సిందే. అయితే ఇక్కడే జరిగింది ఓ చీకటి రాజకీయం. ఇదే అదనుగా డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే ప్రతి పేషేంట్ కి దీన్ని ప్రిస్క్రిప్షన్ గా రాసేవారు… దీనికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సదరు విషయాలను వెల్లడించింది. ఇందుకోసం వైద్యులకు రూ.1000 కోట్ల ముడుపులు అందాయని పేర్కోవడం కొసమెరుపు.

ఈ అంశం చాలా సీరియస్‌గా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది

ఇక వారికి లంచాలు ధనం, మొబైల్స్ రూపంలో కూడా అందాయని ఈ సందర్భంగా తెలిపింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇది చాలా ఆందోళనకరమైన అంశం అని.. కరోనా సోకిన సమయంలో.. ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు. ఫార్మా సంస్థలు నైతికంగా వ్యవహరించేలా చూడటం ముఖ్యం అని మెడికల్ రిప్రంజెటెటివ్ అసోసియేషన్ అభిప్రాయపడింది.

“అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఒప్పందానికి సంతకం చేసినప్పటికీ భారతదేశంలో ఔషధ మార్కెటింగ్ పద్ధతులలో అవినీతి నియంత్రించబడదు”

కంపెనీలు వైద్యులకు ఉచితాలు అందించకుండా నిలిపేనిచట్టమేమీ లేదని కోర్టుకు ఈ నివేదికలో తెలిపింది. ప్రజలకు ఇలా మెడిసిన్ ఇచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరం అని, భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని పేర్కొంది. ఈ పిటిషన్‌కు సంబంధించి పదిరోజుల్లో స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

మైక్రో ల్యాబ్స్‌ అనే సంస్థ డోలో 650 మాత్రలను తయారు చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ CMD దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లో గతంలో సోదాలు జరిగిన సంఘటన కూడా తెలిసినదే. ఈ క్రమంలో మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో పలు పత్రాలు లభించాయి. 2020లో కరోనా వ్యాప్తించిన తర్వాత కంపెనీ రికార్డు స్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. ఏడాదిలో రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దాంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.

 


Share

Related posts

జగన్ “నీరూ”పించుకోవాల్సిన సమయం సందర్భం ఇదే..!

Srinivas Manem

‘స్వామీ శరణు’

sarath

Iliyana : ఇలియానాని రవితేజ రిఫర్ చేశాడా..?

GRK