NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

కోడిని క్ష‌మించిన డొనాల్డ్ ట్రంప్.. ‘షాక్’లో మీడియా!

డొనాల్డ్ ట్రంప్ రెండు ట‌ర్కీ కోళ్ల‌ను క్ష‌మించారు. కూర కావ‌ల‌సిన వాటిని స్వేచ్చ‌గా తిరిగేందుకు అనుమ‌తిని ఇచ్చారు. అయితే ఆ కోళ్లను ఎందుకు క్ష‌మించారు.. అస‌లు కోళ్ల‌ను క్ష‌మించ‌డం ఏంటి అనుకుంటున్నారా..? లేక అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దిగిపోతున్నందుకు వింత‌గా బిహేవ్ చేస్తున్నాడనుకున్నారా..? అలా ఏం కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాలంటే ఈ వార్త‌ను పూర్తిగా చ‌ద‌వాల్సిందే..

ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్యల‌తో వార్త‌ల్లో నిలిచే ట్రంప్ ఇప్పుడు అలా ఉండ‌టం లేదు. ఎన్నిక‌ల్లో గెలుపొంద‌నందుకో లేక మ‌రే కార‌ణాలు ఉన్నాయో కానీ.. ఇప్పుడు నిల‌క‌డ‌గా ఉన్నాడు. అధ్యక్షుడిగా మిగిలి ఉన్న‌ కాలానికి సంబంధించిన ప‌లు అధికారిక కార్యక్రమాలపై ట్రంప్ ఇప్పుడు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే అమెరికా సంప్రదాయం మేర‌కూ ఏర్పాటు చేసే థ్యాంక్స్ గివింగ్ డే. దానికంటే ముందుగానే ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ డేను నిర్వ‌హిస్తారు. ఇందులో ట‌ర్కీ కోళ్లు స్పెష‌ల్ గా నిలుస్తాయి. రోజ్ గార్డెన్ లో జ‌రిగిన ఈ వేడుకలో ట్రంప్ ఉత్స‌హంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు టర్కీ కోళ్లను క్షమించేశారు ట్రంప్. ఈ రెండు ట‌ర్కీ కోళ్ల‌ను ఐయోవా స్టేట్ యూనివర్శిటీలో స్వేచ్ఛ‌గా తిరిగేందుకు ట్రంప్ అనుమ‌తి ఇచ్చారు.

అయితే కోళ్ల‌ను క్ష‌మించ‌డం ఏంట‌ని ప్ర‌శ్న రావొచ్చు. ఇది ఎప్ప‌టినుంచో వ‌స్తున్న సాంప్ర‌దాయం. ప్రతీ ఏడాది థ్యాంక్స్ గివింగ్ డేకు ముందు ది నేషనల్ టర్కీ ఫెడరేషన్ అమెరికా అధ్య‌క్షుడికి రెండు టర్కీ కోళ్లను అందిస్తారు. అధ్య‌క్షుడికి ఇష్టమైతే విందులో ఆ కోళ్ల‌ను తినొచ్చు. లేదంటే క్షమించి వ‌దిలేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ వీటిని వ‌దిలేసారు అన‌మాట‌.

జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు ఉన్న అమెరికా అధ్య‌క్షులంతా ఈ టర్కీ కోళ్లను బుజించారు. కానీ జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్, జార్జి డబ్ల్యు బుష్ లాంటి వారు మాత్రం వాటిని స్వేచ్చ‌గా తిరిగేందుకు అనుమ‌తిని ఇచ్చారు. అలా అనుమ‌తి పొందిన ట‌ర్కీల‌ను డిస్నీ ల్యాండ్ రిసార్ట్‌కు లేకుంటే వాల్ట్ డిస్నీరిసార్ట్‌కు పంపిస్తారు. ఆ త‌రువాత కాలంలో మౌంట్ వెర్నాన్‌లోని జార్జ్ వాషింగ్టన్ ఇంటికి.. లీస్ బర్గ్‌లోని మోర్వెన్ పార్క్‌కు త‌ర‌లించేవారు. ఇలా ట్రంప్ కు ఇచ్చే విందులో ట‌ర్కీల‌కు స్వేచ్చ ల‌భించింది అన‌మాట‌.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju