NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Vishakha Ukku : ఉక్కే కాదు దేనికి లెక్క లేదు! ఆంధ్ర నాయకుల తీరు ఇది!!

ఉక్కే కాదు దేనికి లెక్క లేదు! ఆంధ్ర నాయకుల తీరు ఇది!!

Vishakha Ukku : విశాఖ ఉక్కు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఒక ఉద్యమం రూపంలో మాత్రమే అందరికీ సుపరిచితులు అవుతారు. ఉద్యమానికి ఉన్న పవర్ అలాంటిది. ఒక సమూహాన్ని ఒక తాటి మీద నడిపే శక్తి ఉద్యమానికి ఉంటుంది. ప్రజలందరినీ కదిలించే ఓ అద్భుతమైన ఉద్యమాన్ని ముందుకు నడిపించే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు. ప్రజల జీవితాలకు సంబంధించిన వారికి ఎంతో అవసరమైన, రాష్ట్ర ప్రజలందరినీ కదిలించగల శక్తి ఉన్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు తటపటాయిస్తూ ఉన్నాయి. దీనంతటికీ ఒకటే కారణం కేంద్రంలో బీజేపీ నిర్ణయాలను, నాయకులను ఎదిరించే సత్తా గాని, వారు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే సామర్థ్యం గానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి లేదు. మోడీ అమిత్ షా అంటే గౌరవం మాట పక్కన పెడితే విపరీతమైన భయాన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు నేతలు చూపిస్తున్న డమే దీనికి ప్రధాన కారణం.

Vishakha Ukku dont assitate againest central
Vishakha Ukku dont assitate againest central

ఇది ఆత్మ గౌరవ నినాదం!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 1970 దశకాలలో పెద్ద ఉద్యమం సాగింది. అప్పటికి రాష్ట్రంలో ఉన్న నాలుగు ఉక్కు పరిశ్రమల తో పాటు మరో ఉక్కు పరిశ్రమను సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లతో నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో నౌకాశ్రయానికి దగ్గరగా సముద్రతీర ప్రాంతంలో దీనిని పెడితే బాగుంటుంది అన్న నిపుణుల సూచన మేరకు విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ వచ్చింది. అయితే దీనిని తమవైపు తరలించుకు నేనెందుకు ఇటు గుజరాత్ తమిళనాడు సహా తీర ప్రాంతంలో నగరాలు ఉన్న ముఖ్య రాష్ట్రాలు అన్ని ప్రయత్నించాయి. దీంతో రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం ఊపందుకుంది. చివరకు 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఉక్కు పరిశ్రమకు ప్రారంభోత్సవం చేశారు. జాతికి అంకితం ఇచ్చారు. సుమారు 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని, అంతే సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసేందుకు, దానిని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఉద్యోగుల భద్రత కాకుండా వారికి చెందాల్సిన సౌకర్యాలు, ఇతర బెనిఫిట్స్ అందే అవకాశం ఉండదు. దీంతో పాటు మొత్తం పరిశ్రమ మనుగడ మీదే ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పట్లో ఉక్కు పరిశ్రమ నిమిత్తం సుమారు నాలుగు వేల ఎకరాలకు పైగా సేకరించారు. ఇప్పుడు ఆ భూమి దారి సుమారు యాభైవేల కోట్ల పైబడి ఉంటుందని, ఇక పరిశ్రమ సైతం మరో యాభై వేల పైబడి ఏ విలువ ఉంటుందని.. కేవలం ఉక్కు పరిశ్రమకు సొంత పనులు లేవు అని సాకు చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ సమస్య ఉద్యమ మారే అవకాశం కనిపిస్తోంది. కేవలం ముక్కు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కాకుండా, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరి వద్ద నుంచి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ మీద వ్యతిరేకత వస్తోంది. మరి ఎంతటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం ఉత్సాహం చూపించడం లేదు ముందుకు రావడం లేదు.

ఇంత భయమేల?

ఇటు రాష్ట్రంలో అధికారపార్టీ గా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు గానీ ప్రతిపక్షంగా ఉన్న టిడిపి నాయకులు గానీ మరోపక్క తప్పు జరిగితే ఎవరినైనా ప్రశ్నిస్తా మని చెప్పుకుంటున్న జనసేన పార్టీ నాయకులు గానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం మీద కనీసం మాట్లాడక పోవడం విచారకరం. అధికార పార్టీ నాయకులు కేసుల భయం తో పాటు కేంద్రం చెప్పింది చేయక ఇచ్చింది తీసుకోకపోతే కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడే రకరకాల ఇబ్బందులతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తో సైతం పోటీపడి, ఢిల్లీ పెద్దలను ఎదిరించే సాహసం చేయలేక మీన్న కుండి పోతోంది.
** ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం బీజేపీ మీద గానీ కేంద్ర ప్రభుత్వ తీరు మీద గానీ విమర్శించే పరిస్థితి లేదు. టిడిపి ఇప్పుడు ఎన్డీయేలో జత కలవాలని ఆరాటపడుతున్న వేళ మోడీ కరుణ కోసం చంద్రబాబు వేచి చూస్తున్న సమయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకొని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం టిడిపి నాయకులు సైతం చేయలేని దుస్థితి.
** ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనసేన పార్టీ. బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్ర నాయకులతో టచ్లో ఉంటున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని సైతం కనీసం విమర్శించే లేని పరిస్థితి కి వెళ్ళిపోయారు. కేంద్రం తీసుకునే అన్ని చర్యల మీద బిజెపి రాష్ట్ర నాయకత్వం కంటే వేగంగా అభినందనలు తెలపడం లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు. దీంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఆ పార్టీ సైతం ముందుకు రాలేని పరిస్థితి.
రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో, కీలకమైన పరిశ్రమలు నిర్వీర్యం అవుతున్న వేళ కనీసం ప్రజా ఉద్యమానికి మద్దతుగా రాజకీయ పార్టీలు కనీసం సంఘీభావం తెలపాలని దుస్థితి బహుశా ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి ఇంతలా భయపడే నాయకులు సైతం ఏ రాష్ట్రంలో కనిపించరు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం విశాఖ ఓకే కాదు మరే ఇతర ఉద్యమాలు జరిగినా ఆంధ్రప్రదేశ్ నాయకులకు మాత్రం చీమకుట్టినట్టు ఉండదు.

 

author avatar
Comrade CHE

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N