న్యూస్ హెల్త్

తిన్న తర్వాత అస్సలు ఈ తప్పులు చేయకండి..!

Ancient way of eating food
Share

మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.. అయితే మనం భోజనం తిన్న తరువాత చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు కూడా మన అనారోగ్యానికి కారణమవుతాయి.. భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయద్ద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవెంటాంటే.!?

భోజనం తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగకూడదు.. ఇంకా స్వీట్స్ కూడా తినకూడదు. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తుంటారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రాణాంతకరంగా వ్యాధులు వస్తాయి. ఇంకా టీ కాఫీలు కూడా తిన్న వెంటనే తాగకూడదు. కనీసం ఒక గంట లేదా రెండు గంటల తరువాత మాత్రమే తాగాలి . లేకపోతే గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే ఫ్రూట్స్ కూడా తినకూడదు.. ఇంకా వేడివేడి అన్నంలో చాలా చల్లటి పదార్ధాలు వేసుకుని తినకూడదు.

కొంతమంది తిన్న వెంటనే రిలాక్స్ అవుతారు.. మరికొంత మంది వెంటనే నడుస్తుంటారు.. అయితే ఈ రెండు తప్పే.. తిన్న వెంటనే కాకుండా అరగంట తర్వాత వంద అడుగులు వేస్తే మంచిది.. ఇంకా అరగంట తర్వాత విశ్రాంతి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలాగే కొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తారు.. తిన్న తరువాత సుమారు 2 గంటల తరువాత మాత్రమే స్నానం చేయాలి..


Share

Related posts

రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్ .. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే..?

somaraju sharma

ఈ విషయంలో వైఎస్ తర్వాత జగనే

somaraju sharma

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

Kumar