23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్ హెల్త్

Lunar Eclipse: చంద్రగ్రహణం రోజు చేయకూడని పొరపాట్లు ఇవే.. చేశారో ఇక అంతే..

Share

Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం.. ఈ గ్రహణం 2:38 నిమిషాలకు మొదలై సాయంత్రం 6:18 నిమిషాలకు ముగుస్తుంది.. సర్పకాలం మధ్యాహ్నం 2:38 నిమిషాలు, మధ్యకాలం సాయంత్రం  గంటలు 4:28 నిమిషాలు, మోక్షకాలం సాయంత్రం గంటలు 6:18 నిమిషాలు. గ్రహణ పుణ్యకాలం  గంటలు 3:40 నిమిషాలు.. గ్రహణం సమయంలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Don't Do's on Lunar Eclipse Day
Don8217t Do8217s on Lunar Eclipse Day

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండడం, తినడం నిషేధించబడింది. ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. గుడి తలుపులు, పూజా గదులు మూసివేయాలి. గ్రహణ సమయంలో నిద్ర పోకూడదని కూడా అంటారు. గ్రహణ సమయంలో భగవంతుడి నామాన్ని జపించాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఇంటి నుండి బయటకు రాకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కత్తులు, కత్తెరతో ఏ పని చేయకూడదు. చంద్రగ్రహణం సమయంలో మొక్కలను, చెట్లను తాకకూడదు..

Don't Do's on Lunar Eclipse Day
Don8217t Do8217s on Lunar Eclipse Day

గ్రహణం సమయంలో బయటకు అసలే వెళ్ళకూడదు. గ్రహణానికి ముందు వండిన ఆహారాలను అస్సలు తినకూడదు. గ్రహణం తరువాత ఫ్రెష్ గా వండుకొని తినాలి. గ్రహణం సమయంలో ఏదైనా తాగడం తినడం లాంటివి చేయకూడదు. గ్రహణం కిరణాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కిటికీలను మూసివేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. అలాగే గ్రహణం సమయంలో నూనె రాసుకోకూడదు. గ్రహణానికి రెండు గంటల ముందే భోజనాన్ని పూర్తి చేసుకోవాలి.


Share

Related posts

మంచి చేసి మాట తెచ్చుకుంటున్న కేసీఆర్‌… ప‌రువు పోయే ప‌రిస్థితి

sridhar

Lingayats: యడ్యురప్ప అయినా… బసవరాజ్ బొమ్మై అయినా వీరి సపోర్టు లేకపోతే డమ్మీలే… పదవులు ఢమాలే

arun kanna

Corona: కరోనా ఎటాక్ అయ్యాక వ్యాయామాలు చేసే వాళ్ళు జాగ్రత్త అంటున్న వైద్యులు..!!

sekhar