ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాయి పల్లవి నాగ చైతన్య మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మీద ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు షూటింగ్ కంప్లీటయిన ఈ సినిమా బ్యాలెన్స్ వర్క్ ని పూర్తి చేయడానికి త్వరలో షూటింగ్ మొదలు పెడతారని సమాచారం.
ఇక ఈ సినిమాతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న విరాట పర్వం సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్న సాయి పల్లవి లుక్ మీద ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందించారు. ఇక ఈ సినిమాలో ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సాయి పల్లవి మిగతా హీరోయిన్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఏ పాత్ర అయినా తనకి నచ్చితేనే నప్పితేనే ఒప్పుకుంటుంది. లేదంటే నిర్మొహమాటంగా చేయనని మొహం మీదే చెప్పేస్తుంది.
డబ్బులిస్తున్నారు కదా అని క్రేజ్ ఉంది కదా అని స్కిన్ షో చేయడానికి హీరోలతో ఘాటు ముద్దులకి రొమాన్స్ కి ఎంత మాత్రం ఒప్పుకోదు. అవసరమైతే ఆ సినిమానైనా వదులుకుంటుంది కానీ పొరపాటున కుడా కామిటవదు. అంతే కాదు కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్ విషయం లోను సాయి పల్లవి ఇదే బార్డర్ పెట్టుకుంది. మొత్తానికి సాయి పల్లవి క్రేజ్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు అని లిప్ లాక్స్ కి గ్లామర్స్ గా కనిపించడానికి రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదని అర్థమవుతుంది.