పాన్ ఇండియన్ సినిమాగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ..?

పూరి జగన్నాధ్ చాలాకాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి కం బ్యాక్ అయ్యాడు. రాం హీరోగా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. పూరి కనెక్ట్స్ ..పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. వాస్తవంగా ఈ సినిమాకి ముందు అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. కాని ఇస్మార్ట్ శంకర్ అందరి కెరీర్ ని మలుపు తిప్పింది.

Shooting of Ram Pothineni starrer 'iSmart Shankar' begins | The News Minute

దాంతో వెంటనే పూరి ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నారు. అందుకే ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లో లాస్ట్ షాట్ ఫ్రీజ్ చేసి సీక్వెల్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ శంకర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేపించారు. అప్పట్లో టీమ్ ఊపు చూస్తే నిజంగానే మళ్ళీ పూరి – రాం కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ రెడీ అవుతుందని భావించారు. కాని పూరి ఎందుకనో మనసు మార్చుకొని విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న సినిమా మొదలు పెట్టాడు.

అలాగే రాం కూడా తమిళ సూపర్ హిట్ సినిమా తడం రీమేక్ రెడ్ సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి రిలీజ్ కి రెడీగా ఉండగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తాజాగా దసరా పండగ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే రాం నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటి లేదు. అలాగే పూరి నెక్స్ట్ సినిమా విషయంలో రక రకాల వార్తలు వస్తున్నప్పటికి అధికారంగా మాత్రం ఏ కన్‌ఫర్మేషన్ లేదు.

Sequel to Ismart Shankar is just a publicity stunt

అయితే ఈ లాక్ డౌన్ లో 6-7 కథ లు సిద్దం చేసినట్టు నిర్మాత ఛార్మి వెల్లడించింది. ఆ కథ ల్లో డబుల్ ఇస్మార్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు త్వరలో ఈ సినిమా మొదలబోతున్నట్టు తెలుస్తుంది. అదే గనక నిజమైతే ఖచ్చితంగా మరోసారి పూరి – రాం కాంబినేషన్ లో భారీ హిట్ రావడం ఖాయం అంటున్నారు.