ట్రెండింగ్ న్యూస్

Drama Juniors : సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్ జడ్జిలుగా డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్

drama juniors latest promo released
Share

Drama Juniors : డ్రామా జూనియర్స్ అంటూ సరికొత్త షో త్వరలోనే జీతెలుగులో ప్రసారం కానుంది. డ్రామా జూనియర్స్ అనే పేరులోనే ఉంది ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన షో. పిల్లలు చేసే సందడి చూడాలన్నా… వాళ్లు చేసే కుప్పిగంతులు చూడాలన్నా… ఈ షోను చూడాల్సిందే.

drama juniors latest promo released
drama juniors latest promo released

ఈ షోకు హోస్ట్ గా యాంకర్ ప్రదీప్ వ్యవహరించనుండగా…. ఈ షోకు జడ్జిలుగా సింగర్ సునీత, ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ వ్యవహరించనున్నారు.

రేణు దేశాయ్ ఇప్పటికే చాలా షోలలో జడ్జిగా ఉన్నా.. ఎస్వీ కృష్ణారెడ్డి, సునీత జడ్జిలుగా ఉండడం మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇదే మొదటి సారి. మరి.. వీళ్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Drama Juniors : డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో అదుర్స్

తాజాగా డ్రామా జూనియర్స్ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో హోస్ట్ యాంకర్ ప్రదీప్ తో పాటు… సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్… డప్పు చప్పుళ్ల మధ్య వెళ్తుంటారు. ఇంతలో కొందరు పిల్లలు వచ్చి అల్లరి చేస్తుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేస్తుంటారు. మొత్తానికి ప్రోమో మాత్రం అదిరిపోయింది. త్వరలోనే ఈ షో జీ తెలుగులో ప్రారంభం కానుంది. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా డ్రామా జూనియర్స్ ప్రోమోను చూసేయండి.


Share

Related posts

Gorinta: ఈ చెట్టు ఆకులను ఇలా కూడా వాడొచ్చా..!?

bharani jella

Fire breaks In Kolkata: టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసంలో అగ్నిప్రమాదం..

somaraju sharma

Job notification : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీలు

bharani jella