ట్రెండింగ్ న్యూస్

Drama Juniors : డ్రామా జూనియర్స్ ఫన్నీ ప్రోమో అదుర్స్?

drama juniors next superstar funny promo
Share

Drama Juniors : డ్రామా జూనియర్స్ అనే కొత్త ప్రోగ్రామ్ జీతెలుగులో త్వరలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేయగా…. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షో చిన్నపిల్లలకు సంబంధించింది కావడంతో ప్రోమోను కూడా చాలా ఫన్నీగా తీశారు.

drama juniors next superstar funny promo
drama juniors next superstar funny promo

ఈషోకు జడ్జిలుగా ప్రముఖ నటి రేణు దేశాయ్, సింగర్ సునిత వ్యవహరించనుండగా… యాంకర్ గా ప్రదీప్ ఉండనున్నారు. సింగర్ సునీత… అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ కు జడ్జిగా ఉండటం అనేది చాలా అరుదు. కానీ… తను ఈ షోకు జడ్జిగా ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే… ఈ షో ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు.

Drama Juniors : తాజాగా మరో ఫన్నీ ప్రోమో విడుదల

డ్రామా జూనియర్స్ ఏప్రిల్ 11న రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రారంభం కానుంది. అయితే ఈ షోకు సంబంధించి ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేయగా… తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. అది కూడా చాలా ఫన్నీగా ఉంది.

ఈ షోలో పిల్లలు ఫన్నీ స్కిట్స్ ను చేయనున్నారు. కామెడీ స్కిట్లు లేదా ఏదైనా సోషల్ మెసేజ్ ఇచ్చే స్కిట్ ను పిల్లలు చేస్తారు. ఇదివరకు ఇటువంటి షో జీ తెలుగులోనే ప్రసారం అయ్యేది. దాన్ని ఆపేసి… తాజాగా సరికొత్త లుక్ తో ఈ షోను తీసుకొచ్చారు.

ఇంకెందుకు ఆలస్యం.. డ్రామా జూనియర్స్ ఫన్నీ ప్రోమోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

తెలంగాణ ఇంటెలిజెన్స్ కు ఊపిరి సలపనంత పని!ఎందుకంటే ఇందుకు!!

Yandamuri

చిరంజీవి “చంటబ్బాయ్” రీమేక్ లో రవితేజ ..?

GRK

రెండో వారంలోకి ప్రవేశించిన షట్ డౌన్

Siva Prasad