NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nagarjuna Sagar Bypoll : నాగార్జునసాగర్ ఉపఎన్నిక : టీఆర్ఎస్ లో నాటకీయ పరిణామాలు

Nagarjuna Sagar Bypoll : నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్‌ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక షెడ్యూల్ రానప్పటికీ.. అన్నీ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార టిఆర్ఎస్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

Dramatic Consequences in TRS for Nagarjuna Sagar Bypoll
Dramatic Consequences in TRS for Nagarjuna Sagar Bypoll

Nagarjuna Sagar Bypoll : ఆ ఇద్దరిలో ఒకరు అనుకుంటే!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో అధికార టిఆర్ఎస్‌కు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించడం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని టిఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాకలో దివంగత శాసనసభ్యుడి భార్యను పోటీలో నిలిపినా ఓడిపోవడంతో.. నాగార్జునసాగర్ లో అదే ఫార్ములాను పాటించే విషయంలో అచితూచి వ్యవహరిస్తుంది.
మొదటి నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో నోముల నర్సింహయ్య కొడుకు భగత్ యాదవ్.. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఉండగా.. వారితో పాటు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, రవీందర్ రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.. అయితే చిన్నపరెడ్డి, నోముల భగత్ అభ్యర్థిత్వాలనే ప్రధానంగా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారమైంది. హాలియాలో నిర్వహించిన బహిరంగ సభకు చిన్నపరెడ్డిని.. కేసీఆర్‌ హెలికాప్టర్‌లో తీసుకురావడం ఉహాగానాలకు మరింత బలమిచ్చింది. దీంతో ఇతర ఆశావాహులందరూ వెనక్కి తగ్గి.. కొంతమంది తేరా చిన్నపరెడ్డికి మద్దతుగా.. మరికొంతమంది భగత్ కు మద్ధతుగా నిలుస్తున్నారు.

మలుపు తిప్పేసిన గులాబీ బాస్!

ఇక ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయం అనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా మరి కొన్ని పేర్లు తెరపైకి రావడం గులాబీ శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ స్వయంగా గురవయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మన్నెం రంజిత్ యాదవ్‌లతో ఫోన్లో మాట్లాడడంతో వారి పేర్లు అనూహ్యంగా ఆశావాహుల జాబితాలోకి చేరిపోవడమే కాక.. అందులో ఒకిరికి టికెట్ ఖాయం అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పేర్లన్ని ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావడం విశేషం.ఈ ప్రచారంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బీసీనే ఉంటారని టిఆర్ఎస్ అధిష్టానం లీకులిచ్చింది. ఈ ఒక్క లీకుతో ఇతర సామాజికవర్గానికి చెందిన ఆశావాహులకు తెలివిగా చెక్ పెట్టినట్లయిందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు రేసులో భగత్ యాదవ్ తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన ఇతరులు మాత్రమే ఆశావాహులుగా ఉన్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N