NewsOrbit
న్యూస్

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము గ్రామానికి ఇప్పుడు విద్యుత్ వెలుగులా..?

Draupadi Murmu: ద్రౌపది ముర్ము ఇంతకు ముందు వరకూ ఒరిసా రాష్ట్రానికి, జార్ఖండ్ రాష్ట్రానికే తెలుసు. ఒడిసాలో బీజేపీ నాయకురాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు. జార్ఘండ్ కు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు భారతదేశ ప్రధమ పౌరురాలు అవుతున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఆమె ఎవరో తెలిసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 వసంతాలు దాటినా ఇంకా పలు మారు మూల గ్రామాలు ఇంకా విద్యుత్ వెలుగులు లేక చీకట్లోనే మగ్గుతున్నాయి. ఆ జాబితాలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము స్వగ్రామం కూడా ఉండటం గమనార్హం.

Draupadi Murmu's village is now electrified
Draupadi Murmus village is now electrified

Draupadi Murmu: కిరోసిన్ దీపాలే ఆధారం

ఒడిశా రాష్ట్రం మయూర్ భంజ్ జిల్లా కుసుం సమితిలోని ఉపరోబెడ ద్రౌపది ముర్ము స్వగ్రామం. స్వగ్రామం ఉపరోబెడ కాగా ద్రౌపది ముర్మూ దశాబ్దాల క్రితమే స్వగ్రామాన్ని వదిలి రాయ్ రంగపూర్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఆమె మేనల్లుడి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. 3500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటి వరకూ విద్యుత్ సౌకర్యం లేదు. ముర్ము మంత్రిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత ఓ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న సమయంలోనూ అధికారులు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకూ గ్రామస్తులు కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు.

 

మీడియా కథనాలతో

ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో అందరి చూపు ఆమె స్వగ్రామం వైపు పడింది. ముర్ము స్వగ్రామానికి మీడియా వెళ్లడంతో అక్కడి ప్రజల పరిస్థితి లోకానికి తెలిసింది. రాష్ట్రపతి అవుతున్న ద్రౌపది ముర్ము గ్రామంలోనే విద్యుత్ సౌకర్యం లేదని మీడియాలో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన ట్రాన్స్ ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ గ్రామాన్ని పట్టించుకోని అధికారులు ఇప్పుడు ద్రౌపది ముర్ము పుణ్యమా అని విద్యుత్ సరఫరా కల్పిస్తుండటం పట్ల గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సౌకర్యం లేని ఇలాంటి కుగ్రామాలు ఇంకా ఉన్నాయి. ఆ కుగ్రామాలకు కరెంటు రావాలంటే ఆ గ్రామాల నుండి రాష్ట్రపతులు అయితేనే అధికారులు స్పందిస్తారేమో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju