మందు కొట్టినప్పుడు మీకు తప్ప అందరికి తెలిసే విషయాలు ఇవే !!

Share

చాలామంది నాలుగు పెగ్గులు మందు వేయగానే దారాళం గా ఇంగ్లీష్‌ వాడేస్తుంటారు . దీని వెనుక  కారణం వేరే ఒకటి ఉంది.ఈ పరిణామం  మీద చాలా పరిశోధనలు కూడా జరిగాయి. కేవలం మందు తాగినప్పుడు మాత్రమే ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అనేదానిపై  చాలా మంది  చాలా  రకాలు  గా  రీసెర్చ్ చేశారు.సైకోఫార్మాలజీ జర్నల్ చేసిన ప్రచురణ ప్రకారం రెండు పెగ్గుల  మందు తాగిన తర్వాత మనుషుల్లో దాగి ఉన్నభయం, మొహమాటం, మాయమవుతుంది. అది  పోగానే  నాకు ఏదైనా సాధ్యమే అనే వైఖరి వారిలో వచ్చేస్తుంది.


వారి సంకల్పం మరింత  దృఢమవుతుంది ఈ కారణంగా మద్యం తాగిన తర్వాత వారిలో  కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక మన భారతీయుల్లో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం భయపడుతుంటారు. ఇంగ్లీష్ తెలిసినప్పటికి  చిన్న చిన్న తప్పులు వస్తాయి అనే ఉదేశ్యం తో  ఇంగ్లీష్ మాట్లాడటం మనుకుంటారు . కానీ కొంతమంది పార్టీల లో మందు తాగిన తర్వాత  అకస్మాత్తుగా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంటారు.

ఇంకా  చెప్పాలంటే వారు పూర్తి విశ్వాసంతో భయమన్నది లేకుండా  ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెడతారు. ఆ తర్వాత వారు ప్రతి ప్రశ్నకు ఆంగ్లంలో మాత్రమే  సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతారు.  వాస్తవానికి జనం అలా చేయడం వెనుక శాస్త్రీయ కారణం ఉందట.మద్యం తాగిన తరువాత ఏ విషయం అయినా నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు.

అది కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి  కాన్ఫిడెన్స్కారణం గా  చెప్పుకోవచ్చు.కేవలం ఇంగ్లీష్‌లో మాట్లాడటం మాత్రమే కాకుండా  వేరే భాషల్లో కూడా మాట్లాడుతుంటారు. మందు తాగిన తరువాత డాన్స్‌లు చేయడం పాటలు  పాడడం  వంటివి కూడా చేస్తుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను వేరే వ్యక్తులతో చెప్పుకుంటుంటారు. మందు తాగినప్పుడు  కొంతమంది వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది.


Share

Related posts

చివరి రోజు 10 మంది టిడిపి సభ్యులు సభ నుండి సస్పెండ్..!!

sekhar

నిండు కుండలా శ్రీశైలం జలాశయం – కొనసాగుతున్న వరద

Special Bureau

Rang de : రంగ్ దే ఓటీటీలోనైనా హిట్ అవుతుందా..?

GRK