NewsOrbit
న్యూస్ హెల్త్

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే సంగతులు!

టీ, కాఫీ మనిషికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడే చక్కటి ఔషదం. పనిలో కూసింత సమయం దొరికితే చాలు కొలిగ్స్ తో కలిసి టీ టైంమ్ అంటూ ఒక చక్కటి టీ సేవిస్తుంటారు చాలా మంది. ఇండియాలో టీ కున్న ఫేమస్ మరేదానికి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా ఇండియాలో టీ లేదా కాఫీ షాపులు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. ఫుట్ పాత్, రైల్వే స్టేషన్, బస్ స్టాప్ ఇలా ప్రతి దానిముందట టీ, కాఫీలు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. కాగా టీ లేదా కాఫీ లు తాగేవారు చాలా మంది వారు తాగే టీ గ్లాస్ మూలంగా ఎంత ప్రమాదం పొంచి ఉందో మాత్రం గ్రహించలేకపోతున్నారు.

టీ, కాఫీ లను చాలా వరకు పేపర్ కప్పులలో వినియోగిస్తుంటారు. అయితే ఈ పేపర్ కప్పుల మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పేపర్ కప్పులో టీ లేదా కాఫీలను తాగడం మూలంగా ప్లాస్టిక్ శరీరంలోకి చేరి అనేక అనారోగ్య సమస్యలను తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తాగినవెంటనే ఆ ప్లాస్టిక్ శరీరంపై ప్రభావం చూపకపోయినా ఫ్యూచర్ లో మాత్రం పేపర్ కప్పులో తాగినవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ప్రొఫెసర్లు పరిశోధన ద్వారా వెళ్లడించారు. కాగా వేడి వేడి టీ లేదా కాఫీ డిస్పోజబుల్ పేపర్ కప్పులలోని ప్లాస్టిక్ కణాలు మనిషి శరీరంలోకి చేరతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా 3 సార్లు ఈ పేపర్ కప్పులలో కాఫీ లేదా టీ తాగినట్టయితే 75 వేల అతి సూక్ష్మ మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళతాయని నిపుణులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

వేడి వేడి టీ లేదా కాఫీలను ఆ కప్పులలో పోయడం మూలంగా ప్లాస్టిక్ కరిగి శరీరంలోకి చేరుతుందని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. కాగా ఈ ప్లాస్టిక్ శరీరంలోకి చేరి అనేక వ్యాధులను సృష్టించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ మూలంగా కొన్ని సార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని తెలుపుతున్నారు. మరీ ఈ పేపర్ కప్పులలో టీ తాగే వారు ఇకనైనా జాగ్రత్తవహించి వాటికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే మీరు అనారోగ్యాన్ని చేతులారా కొని తెచ్చుకున్నవారవుతారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!