దాహం వేయకుండానే ఎక్కువ నీటిని తాగుతున్నారా??ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Share

Water: నిత్యం ఆహారంతోపాటు మ‌నం మ‌న శ‌రీరానికి త‌గినంత నీటిని కూడా అందించవలిసిందే. అయితే ఈ మధ్య నీటిని ఎక్కువగా తాగాలని అన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది.మ‌నం ఆహారాన్ని ఎలాగైతే సరిపడా తీసుకుంటామో… అలాగే నీటిని కూడా మ‌న‌ శరీరానికి అవ‌స‌రం ఉన్నంత వరకే తాగాలి తప్ప ఎక్కువగా తాగకూడదు. అలా ఎక్కువగా నీటిని తాగితే మ‌న ఆరోగ్యానికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు. దాహం గా అనిపించినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలి త‌ప్ప.. అదేపనిగా నీటిని తాగ‌రాద‌ని వారు తెలియచేస్తున్నారు.

Drinking Water With Less Hungry
Drinking Water With Less Hungry

ఇక ప్రతి రోజు 8 గ్లాసులు లేదా అంతకు మించి నీటిని తాగాలి అంటారు కానీ.. అంద‌రికీ ఆ సూత్రంపనిచేయదని, బాగా దాహం అయ్యేవారు మాత్ర‌మే ఆ నీటిని తాగాల‌ని, ఇత‌రులు క‌చ్చితంగా 8 గ్లాసుల నీటిని రోజుకు తాగాల్సిన నియమం ఏమి లేదని, త‌మ‌కు కావలిసినంత నీటిని మాత్రమే తాగ‌వ‌చ్చ‌ని సైంటిస్టులుసూచిస్తున్నారు.ఇక మ‌న‌కు నీరు ఎంత కావాలో నిర్ణ‌యించుకునే వ్య‌వ‌స్థ కూడా మ‌న శ‌రీరంలో ఉంటుంద‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు. ఆ వ్య‌వ‌స్థ మ‌నం నీటిని ఎక్కువ‌గా తీసుకోకుండా చూస్తుంద‌ట‌. నీటిని అవసరానికి మించి తాగితే హైపోనెట్రేమియా అనే స‌మ‌స్యమొదలవుతుందని, దీంతో శ‌రీరంలో ఉండే ద్ర‌వాలు పలుచగా మారి, సోడియం స్థాయి తగ్గిపోతుందని, అలాగే శ‌రీరంలో ఉండే క‌ణ‌జాలం నశించిపోయి.. క‌ణాలు వాపున‌కుగురవుతాయి అని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు స్పృహ త‌ప్పిపడిపోవడం కూడా జరుగుతుందట. అదే ప‌రిస్థితి విష‌మిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సైంటిస్టులు వివరిస్తున్నారు.కాబట్టి మీరు కూడా అవసరానికి మించి నీటిని తీసుకోకండి. శరీరానికి నీటి అవసరం ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ దాహం రూపంలో మనకుఅందుతాయి.కాబట్టి దాహం వేసిన‌ప్పుడు మాత్రమే నీటిని తాగండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు.


Share

Related posts

ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా స్టోరీ గురించి టిడిపి పార్టీలో చర్చ..??

sekhar

మాయావతికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

somaraju sharma

YS Sharmila : వైఎస్ షర్మిలకు కెసిఆర్ సర్కార్ భద్రత

somaraju sharma