NewsOrbit
న్యూస్ హెల్త్

తాగడం వలన బొజ్జ తగ్గుతుంది!! దానివెనుక రహస్యం ఇదే…

తాగడం వలన బొజ్జ తగ్గుతుంది!! దానివెనుక రహస్యం ఇదే...

నేటి కాలంలో అందర్నీ బాగా  వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’. దీన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయోగాలు చేస్తుంటారు. ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు చేరిపోతుంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే  ప్రమాదం లేకపోలేదు. అందువల్ల కృత్రిమం గా కాకుండా సహజం గా కొవ్వు తగ్గించుకునే ప్రయత్నాలు చేయడమే మంచిది.

తాగడం వలన బొజ్జ తగ్గుతుంది!! దానివెనుక రహస్యం ఇదే...

బొజ్జ లో ఉన్న కొవ్వు తగ్గించుకోవడాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నప్పుడే విజయం సాధించగలరు అని గుర్తు పెట్టుకోవాలి. బరువు తగ్గాలనే మొండి పట్టుదలతో  పాటు ఆహార నియమా ల  విషయం లో కఠినం గా ఉండటం చాలా ముఖ్యం. సహజం గా పొట్టలో  చేరిన కొవ్వు ను   తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన పానీయా ల గురించి తెలుసుకుందాం.

ఉదయం లేవగానే  ఒక గ్లాసు నిమ్మ రసం తీసుకోవడం తో  రోజు ప్రారంభించడం మంచిది. ఇది పొట్ట లో చేరిన కొవ్వు ని  తగ్గించడంలోబాగా పని చేస్తుంది. నిమ్మకాయ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పెక్టిన్ ఫైబర్లు దండిగా లభిస్తాయి.ఇవి బొడ్డు చుట్టూ  నిల్వ ఉన్న కొవ్వును తగ్గిస్తాయి .  గోరువెచ్చని నీటి లో  ఒక టీస్పూన్ తేనె, కొన్ని చుక్కల నిమ్మ రసం కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

ఆరోగ్యం, పోషణ కొరకు ప్రపంచం లో ఎక్కువగా తాగేది గ్రీన్ టీ. దీనిలో కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి కొవ్వును కరిగించడానికి మరియు జీవ క్రియను పెంచడానికి ఉపయోగపడతాయి. మీరు చక్కెర కలిపి లేదా చెక్కెర లేకుండా కూడా దీన్ని తాగవచ్చు. కనీసం రోజుకు  3 కప్పు ల గ్రీన్‌టీ త్రాగడం మంచిది.

ఒక గ్లాసు నీటి లో ఒక టేబుల్ స్పూన్  జీలకర్రను వేసి రాత్రి అంత నానబెట్టండి. దాన్ని వడ కట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వలన జీవ క్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. జీలకర్ర నీళ్లు ఆకలిని అణిచివేయడమే కాకుండా అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. దానితో బెల్లీ ఫ్యాట్ను వదిలించుకోవడానికి ఇది సమర్థవంతంగా ఉపయోగ పడుతుంది. 2-3 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ను  ఒక గ్లాసు నీటి లో వేసి  రుచి కోసం కొన్నిచుక్కల నిమ్మ రసం మరియు తేనెనుకలుపుకుని తాగాలి.ఇలా తీసుకోవడం ద్వారా పొట్ట వద్ద ఉన్న కొవ్వు మరియు బరువు తగ్గుతుంది.

ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన కలబంద రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడం బరువు తగ్గడం కూడా జరుగుతుంది. గ్రీన్ కాఫీ లో క్లోరోజెనిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. క్లోరోజెనిక్ ఆమ్లం కొవ్వు ల ను శక్తిగా మార్చేటప్పుడు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్యాట్ను త్వరగా తగ్గేలా చేస్తుంది. దీన్ని ఇన్స్టంట్ కాఫీ కి బదులుగా రోజు తాగవచ్చు .వీటిలో ఏదో ఒక విధానాన్ని ప్రతి రోజు అనుసరిస్తూ ఉండడం వలన బరువు అదుపులో ఉంటుంది.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju