NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

డ్రైవర్ రహిత..! కూ.. చిక్ చిక్.. ఎక్కడంటే..

 

ఆటోమొబైల్ పరిశ్రమ లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తున్నాయి.. ఈ టెక్నాలజీల ద్వారా సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి.. భారతదేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం మెజెంటా లైన్ ఢిల్లీలోని జనక్ పురి – నోయిడాలోని బొటానికల్ గార్డెన్ కలుపుతూ 37 కిలోమీటర్ల డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపారు.. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఏడు శాతం డ్రైవ్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది..

 

2022 నాటికి ఢిల్లీ మెట్రో నెట్వర్క్ మొత్తాన్ని డ్రైవర్ రహిత మెట్రో గా మార్చేందుకు భారతీయ రైల్వే పని చేస్తోంది. ఢిల్లీ మెట్రో లోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా దీనిని ఆపరేట్ చేస్తున్నారు. ఈ కమాండ్ సెంటర్ లో సిబ్బంది తప్ప రైలు లో ఎలాంటి డ్రైవర్ ఉండరు. ఈ ట్రైన్ లో కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ సిగ్న లింక్ టెక్నాలజీ ఉంది. ఇది ఆపరేషన్ సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందులో హార్డ్ వేర్ పునఃస్థాపన సమయంలో మాత్రమే మానవ సహాయం తీసుకుంటుంది, మిగతా సందర్భాల్లో దీన్ని నడిపేందుకు డ్రైవర్ అవసరం లేదు. కమాండ్ సెంటర్ నుండి ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్ ద్వారా నియంత్రిస్తుంది. సీసీటీవీల సాయంతో క్రౌడ్ ను పర్యవేక్షిస్తుంది.

 

వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీ మెట్రో లోని 57 కిలోమీటర్ల పింక్ లైన్ లో డ్రైవర్ లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా తొమ్మిది శాతం డ్రైవర్ రహిత రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మెజెంటా లైన్ ఢిల్లీలోని జనక్ పురి – నోయిడాలోని బొటానికల్ గార్డెన్ కలుపుతూ డ్రైవర్ లెస్ రైలు కార్యకలాపాలు జరుగుతాయి. ప్రస్తుతానికి ఈ సేవలు మెజెంటా లైన్ లో మాత్రమే జరుగుతాయి. పింక్ లైన్ కూడా వచ్చే ఏడాదికి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైల్ ఎక్కడం మర్చిపోకండి.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju