పులిని దూరం నుంచి చూడాలనిపించింది.. అనుకో చూసుకో…! అదే పులి తో ఫోటో దిగాలి అనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు.. ట్రై చేయొచ్చు..! సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది..! రోజూ రాత్రిపూట ఒక గ్లాస్ వైన్ తాగితే చాలు ఆరోగ్యం, అందం రెండు సొంతం..! ఇప్పుడు అదే పులిని వేటాడి టైగర్ వైన్” తయారుచేస్తుంది..! బుర్ర తిరిగినట్లు ఉందా..? నిజమే మరి.. ఆ ఘనత చైనీయులదే..! పూర్తి కథనం ఇలా..
ప్రపంచంలో ఎవరూ తినలేని వాటిని తినేది ఒక్క చైనాలోనే. కదిలే ఏ ప్రాణైన పళ్లెంలో పలహరమే. పురుగు, పుట్రా, పాము, ఎలుక ఏదైనా గుటకాయస్వాహా.. ఇప్పుడు ఏకంగా పులి ఎముకలతో ‘వైన్’ చేసుకొని తాగేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘టైగర్ ఫామ్స్’ ఏర్పాటు చేసి పులులను పెంచుతున్నారు.
రాజసానికి ప్రతీక పెద్దపులి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పెద్ద పులుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. పులులను వ్యాపార అవసరాల కోసం పెంచవద్దని ప్రపంచ దేశాలు తీర్మానించాయి. దీనిపై 171 దేశాలు సంతకాలు చేయగా, అందులో చైనా కూడా ఉన్నది. అయినా, ఆ నిబంధనలను తుంగలో తొక్కి, దొంగచాటుగా పులులతో వాణిజ్యం చేస్తున్నది. అంతర్జాతీయ తీర్మానాన్ని అంగీకరించినా, ఒక్క నిబంధననూ పాటించిన పాపాన పోలేదు. పులులను సంరక్షించేందుకే పెంచుతున్నామని చైనా దబాయిస్తూ అంతర్జాతీయ సంస్థల కన్నుగప్పి, యథేచ్ఛగా పులుల శరీర భాగాలతో వ్యాపారం కొనసాగిస్తూనే ఉంది.
ఫామ్స్ లో భద్రం..!
మన దగ్గర కోళ్ల ఫామ్స్, మేకలు/గొర్రెల ఫామ్స్ ఉన్నట్లే.. చైనాలో ‘టైగర్ ఫామ్స్’ నిర్వహిస్తున్నారు.. 200 పైగా ఉన్న ఈ ఫామ్స్‌లో 6000 పైగా పులులను పెంచుతున్నారు. ఓ పక్క అట్టవీశాఖ ఉన్న పులులు మాయమవుతాన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో సగానికిపైగా చైనాలోని ‘టైగర్ ఫామ్స్’లోనే బందీలుగా ఉన్నాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూ డబ్ల్యూఎఫ్), పర్యావరణ దర్యాప్తు సంస్థలు ఇటీవల వెల్లడించాయి. అయితే చైనాలో పులుల అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టారు. అందులో పలు విస్తుగొలిపే విషయాలను బయట ప్రపంచానికి తెలియజేసింది. దృఢంగా పెరిగేలా బలమైన ఆహారం అందిస్తున్నారు.