NewsOrbit
న్యూస్

విమానంలో మైకం ఖరీదు!

డేవిడ్ స్టీఫెన్ యంగ్‌కు కాస్త మందు ఎక్కువ అయింది. దానికి అతను చెల్లించిన మూల్యం 16 వేల డాలర్లు. తర్వాత ఇంకా చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.

44 ఏళ్ల యంగ్ జనవరి నాలుగున కెనడాలోని కాల్గరీ నగరం నుంచి లండన్ వెళ్లే వెస్ట్‌జెట్ విమానంలో ఎక్కాడు. దానికి ముందు వరసగా ఆరు రౌండ్లు మద్యం తాగాడు. తాగింది తలకెక్కింది. టేకాఫ్ సమయంలో టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది అడ్డుకున్నారు. యంగ్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ లోపు విమానం గాల్లోకి లేచింది. యంగ్ వీరంగం మాత్రం ఆగలేదు. అతని గొడవ చూసి ప్రయాణీకులు భయభ్రాంతులయ్యారు.

తప్పనిసరి పరిస్థితుల్లో విమానం పైలట్ వెనక్కు వెళ్లాలని నిర్ణయించాడు. విమానం పొట్ట నిండా ఉన్న ఇంధనం ఉన్న కారణంగా కాల్గరీలో తిరిగి సురక్షింతంగా ల్యాండ్ అవ్వడం కుదరదు. చేసేది లేక పైలట్ 20 వేల టన్నుల ఇంధనం నేలపాలు చేసి విమానాన్ని దించాడని యుఎస్‌ఎ టుడే తెలిపింది.

పోలీసులు యంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టారు. తప్పు చేశానని ఒప్పుకున్న యంగ్‌కు జడ్జి 16 వేల రూపాయాల జరిమానా విధించారు. ఆ డబ్బు వెస్ట్‌జెట్‌కు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. నిజానికి ప్రయాణీకులకు చెల్లించాల్సిన నష్టపరిహారం కూడా కలుపుకుంటే వెస్ట్‌జెట్‌పై లక్షా 50 వేల డాలర్ల వరకూ భారం పడుతుంది. నష్టపరిహారం కోసం యంగ్‌పై సివిల్ దావా వేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.

author avatar
Siva Prasad

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Leave a Comment