NewsOrbit
న్యూస్

డ్రైఫూట్ ‘గ్యాంగ్ లీడర్ అరెస్ట్!అతనెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ప్రపంచంలోనే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251ను ఆఫర్ చేసిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఫౌండర్ మోహిత్ గోయెల్ ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.

డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్న మోహిత్ రూ.200కోట్ల రూపాయల మేర సరుకు సరఫరా చేసిన వారిని మోసం చేసినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

ఏపీ నుండి కూడా ఫిర్యాదులు!

పోలీసుల కథనం ప్రకారం.. గోయెల్ మరో ఐదుగురితో కలిసి దుబాయ్ లో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ హబ్ నేతృత్వంలో వ్యాపారం చేస్తున్నాడు. నోయిడా సెక్టార్ 62లో ఈ కంపెనీ ఆఫీసు ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి ఆ కంపెనీ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసేది.అలా సరుకు సరఫరా చేసిన వారి నుండి కంప్లైట్లు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతణ్ని అరెస్టు చేశారు.

ఇదీ ఆయన మోడస్ ఆపరాండీ!

గోయెల్ మరో ఐదుగురితో కలిసి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తుండేవాడు. అలా సరఫరా దారుల అభిమానం సంపాదించుకున్న గోయెల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా 40శాతం పేమెంట్ ను అడ్వాన్స్ కింద ఇచ్చేవాడు. మిగతా పేమెంట్ చెక్కు రూపంలో ఇస్తానంటే అంతా నమ్మేశారు. తీరా ఆయన ఇచ్చిన చెక్కులను తీసుకెళ్లి బ్యాంకుల్లో వేశాక అవి బౌన్స్ అయ్యేసరికి తెలిసింది అసలు నిజం.తమ పేమెంట్ పూర్తిగా ఇవ్వకపోగా.. ఆ డ్రై ఫ్రూట్స్ ను ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తున్నాడని తెలుసుకున్నారు. బాధితుల్లో ఒకరైన ఓం ప్రకాశ్ జాంగిడ్ అనే వ్యక్తి చేసిన కంప్లైంట్ మేరకు నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. గోయల్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు వ్యాపారులు కూడా ఉన్నారని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

కాగా పోలీసులు ఆడితో పాటు రెండు కార్లను 60కేజీల డ్రై ఫ్రూట్స్, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు కంపెనీ నిర్వహిస్తున్న సుమిత్ యాదవ్, రాజీవ్ కుమార్, ప్రవీణ్ సింగ్ సిర్వాన్ లకు కూడా ఇందులో భాగముందని తెలిసి వారిని కూడా అరెస్టు చేశారు. కాగా గోయెల్ మీద ఫోర్జరీ కేసులు కూడా ఉన్నాయని నోయిడా పోలీసులు తెలిపారు.అంతేగాకుండా సరుకు ఇచ్చిన వారికి డబ్బు ఎగ్గొట్టేందుకు వారిని హనీ ట్రాప్ లో ఇరికించేవారని పోలీసులు చెప్పారు..ఆ తర్వాత హనీట్రాప్ వీడియోలను వ్యాపారులకు చూపి వారిని బ్లాక్మెయిల్ చేసే వారన్నారు.ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని నోయిడా పోలీసులు స్పష్టం చేశారు ఇదే గోయల్ గతంలో అతి చౌక ధరకు స్మార్ట్ఫోన్ను ఇస్తానని పెద్దఎత్తున ప్రచారం సాగించారు.అప్పట్లోనే ఆయనపై పలు ఫిర్యాదులు ,ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు ఆయన అసలు రంగు బయటపడింది.

 

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju