NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి..! ఖరారు చేసిన సోనియా గాంధీ ..!!

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరావుకు ఖరారు అయ్యింది. తెలంగాణ పీసీసీ పంపిన ప్రతిపాదన మేరకు శ్రీనివాసరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం శ్రీనివాసరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది.

శ్రీనివాసరెడ్డి నిన్ననే టీఆర్ఎస్‌కి రాజీమానా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే టి నర్సారెడ్డిని దుబ్బాక ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ భావించింది. ఇటీవల రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ అభ్యర్థి గురించి చర్చించి నర్సారెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దుబ్బాక నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవాలని భావించి ఆ పార్టీ నుండి వచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఖారారు చేసింది కాంగ్రెస్ పార్టీ.

నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా ఈ నెల 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును, బీజెపీ అభ్యర్థిగా రఘునందరావులను ఆయా పార్టీలు ఖరారు చేశాయి.

 

author avatar
Special Bureau

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju