బ్రేకింగ్: దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన షెడ్యూల్ ను ఎలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అనారోగ్యం కారణంగా అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని ఎన్నికల కోసం ముమ్మరం చేసాయి.

 

dubbaka by poll schedule released
dubbaka by poll schedule released

 

ఇక ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీగా అక్టోబర్ 16ను నిర్ణయించారు. వాటి పరిశీలన అక్టోబర్ 17న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. ఇక దుబ్బాకలో పోలింగ్ నవంబర్ 3న నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 10న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది ఎలెక్షన్ కమిషన్. ఎలెక్షన్ షెడ్యూల్ రావడంతో ఈరోజు నుండి ఎలెక్షన్ కోడ్ అమల్లో ఉండనుంది.