RRR: బాహుబలి(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వస్తున్న “RRR” సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో వీడియోలు.. రాజమౌళి(Rajamouli) టేకింగ్ ఏంటో మరోసారి RRR ద్వారా.. ప్రపంచానికి తెలియజేయండి ఉన్నట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి. సినిమా దాదాపు కంప్లీట్ అయిన క్రమంలో వచ్చే ఏడాది జనవరి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించడం జరిగింది. అనేక వాయిదాల పడుతూ వస్తూ ఉండటంతో ఈసారి జనవరి 7 కన్ఫామ్ కావడంతో నందమూరి మెగా హీరోలు.. సంక్రాంతి పండుగ ముందే చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఫస్ట్ టైం ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) కలిసి నటిస్తుండటంతో సౌత్ ఇండస్ట్రీ లోనే.. ఈ సినిమా అతి పెద్ద భారీ మల్టీస్టారర్ సినిమాగా నిలిచింది. ఇటువంటి తరుణంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో రికార్డు సృష్టించడంతో..RRR తో.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ చెప్పటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి.
రాజమౌళి.. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ..
విషయంలోకి వెళితే సోమవారం హైదరాబాద్లోని(Hyderabad) ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్ దేవ్ అదే రీతిలో డాక్టర్ రవి తంగిరాల తో పాల్గొన్న రాజమౌళి.. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ద్వారా.. ఛాయిస్ ఫౌండేషన్ సతీష్ పరిచయం అయ్యారని ప్రసంగించారు. పిల్లల కోసం ఛాయిస్ ఫౌండేషన్ చేసే మంచి పనులను గురించి రాజమౌళి కొనియాడారు. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి”. అదే రీతిలో మంచి పనులు ఎక్కడ జరుగుతాయో అక్కడ అదే రీతిలో మంచి మనుషులు.. కలుస్తారని.. అన్నట్టుగా రాజమౌళి కొనియాడాడు. ఇదిలా ఉంటే ఈ ఛాయిస్ ఫౌండేషన్ కోసం దాదాపు రెండు కోట్ల రూపాయల చెక్.. మాస్ మ్యూచువల్ ఫండ్ తరఫున రవి తంగరాల అందించడం జరిగింది.