ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు వారికి కూడా సుపరిచతమయ్యాడు. అలాగే ఇటీవలే డబ్బింగ్ సినిమా కనులు కనులను దోచాయంటే సినిమాతో సూపర్ హిట్ ను కూడా అందుకున్నాడు.
గత కొంత కాలం నుండి దుల్కర్ సల్మాన్ నటించబోయే డైరెక్ట్ తెలుగు సినిమా గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో త్వరలో ఒక సినిమా చేస్తానని గతంలో ప్రకటించాడు. నేడు దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మలయాళ హీరో తెలుగు సినిమా గురించిన విశేషాలు వెల్లడయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారి స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హను రాఘవపూడి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!