దుమ్ము లేపుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350..! 15 రోజుల్లోనే 800 బుకింగ్స్..

రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి బైక్ వస్తుందంటే అందరి చూపు అటువైపే ఉంటుంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త బైక్ లాంచ్ అయిన తరువాత వినియోగదారులనుంచి మంచి స్పందన వస్తోంది..! ఎంతలా అంటే..?ఈ బైక్‌కు కేవలం 15 రోజుల్లో 8000 కి పైగా బుకింగ్‌లు వచ్చాయి..! ఇంతలా ఆకర్షించిన ఈ బైక్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..!

 

royal infield meteyero 350

ఈ బైక్ వచ్చి ఇప్పటికే ఒక నెల పూర్తి కావొస్తోంది.. ఇప్పుడు దీని బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ధరవినియోగదారులకు అందుబాటులో ఉంది. అందువలన ఇది పోటీదారులకు కఠినమైన పోటీని ఇస్తుంది. హోండా ఇటీవలే దీనితో పోటీ పడటానికి హైనెస్ సిబి 350 ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్నప్పటికీ, మీటియోర్ 350 మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం..

 

 

ఫీచర్లు..
వీటితో పాటు రెట్రో లుక్ తో ఉండి మోడ్రన్ టచ్ తో అందుబాటులో వచ్చింది. ఈ మోటార్ సైకిల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, హాలోజెన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు ఉన్నాయి. అంతేకాకుండా 15-లీటర్ ఫ్యూయల్ ట్యాంకుతో పాటు రెయిజ్డ్ వైడ్ హ్యాండిల్ బార్లు, ఫార్వార్డ్ సెట్ ఫుట్ పెగ్స్, వెల్ క్యూషెన్డ్ పిల్లియన్ బ్యాక్ రెస్ట్ ను కలిగి ఉంది. ఈ సరికొత్త బైక్ కనెక్టెడ్ సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, గూుగల్ మ్యాప్స్ తో టిప్పర్ నేవిగేషన్ టెక్నాలజీని ఇందులో ఉన్నాయి.

స్పెషల్ ఫీచర్స్ :
ఈ మోటార్ సైకిల్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్ తో పాటు టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఫ్రంట్, 260 ఎంఎ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ రియర్ ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19-అంగుళాల, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు డ్యూబ్ లెస్ టైర్లు సెక్షన్ 100/90, 140/70 ఫ్రంట్ అండ్ రియర్ సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది.

 

 

ఇంజిన్ సామర్థ్యం :
రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మీటియోర్ బైక్ 349 సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ సీ ఇంజిన్ ను కలిగి ఉండి 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్పీఎం వద్ద 27ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.ఆల్ న్యూ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ 650సీసీ ఇంజిన్ మాదిరి ఉంది. సరికొత్త ఛేసిస్ రిజిడ్ స్టేబుల్ ఆఫరింగ్ ఎన్హాన్సెడ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీలతో ఎన్వీహెచ్ లెవల్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ సైకిల్ సస్పెన్షన్ డ్యూటీస్ 41 ఎంఎం టెలిస్కోపిక్ యూనిట్, 130 ఎంఎం ట్రావెల్, ట్విన్ షాక్ సెటప్ తో పాటు 6-స్టెప్ అడ్జస్టబిలిటి ప్రీలోడ్ లాంటి ఫీచర్లతో కన్వెన్షనల్ బాక్ సింగ్రామ్ ను కలిగి ఉంది.

‘ట్రిప్పర్ నావిగేషన్’ అని పేరు పెట్టబడిన ఈ క్రూయిజర్ బైక్‌లోని టర్న్-బై-టర్న్ నావిగేషన్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ గా ఇవ్వబడింది. ఇవి కాకుండా ఈ సరికొత్త మీటియోర్ 350 మోటార్ సైకిల్లో ట్విన్ పాడ్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ డిజైన్, మెయిన్ యూనిట్ తో అనలాగ్ స్పీడ్ రీడింగ్ స్మాల్ డిజిటల్ డిస్ ప్లేతో హోస్ట్ ఆఫ్ ఇన్ఫార్మెషన్ ను కలిగి ఉంది. వీటిలో గేర్ ఇండికేటర్స ఓడిఓ, త్రీ ట్రిప్ రీడింగ్స్, క్లాక్, ఫ్యూయల్ ఇండికేటర్, సర్వీస్ రీమైండర్, ఎకో ఇండికేటర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కలర్డ్ టీఎఫ్డీ డిస్ ప్లే, యూఎస్బీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ బైక్ కు పోటీగా హోండా హెచ్ నెస్ సీబీ350, బెనెల్లి ఇంపీరియల్ 400, జావా 300 ట్విన్ బైక్స్ ఉన్నాయి.