పిలిప్పైన్ లో భూకంపం- సునామీ హెచ్చరికలు

ఫిలిప్పైన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 త్రీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల కేంద్రం పేర్కొంది. పిలిప్పైన్ లోని  మిండానావో దీవిలో ఈ ఉదయం సంభవించిన భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు.

తూర్పు పిలిప్పైన్ నగరమైన జనరల్ సాంటోస్ కి 193 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియెలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఫిలిప్పైన్, ఇండోనేసీయా తీరాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది.

SHARE