Earthworm Smuggling: వానపాములను స్మగ్లింగ్..! కేజీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Share

Earthworm Smuggling: కుక్క పిల్ల.. అగ్గిపుల్ల..సబ్బు బిళ్ల, హీనంగా చూడకు దేన్నీ..కవితామాయయేనోయ్ అన్నీ..తలుపు గొళ్ళ, హారతి పల్లెం..గుర్రం కళ్ళెం కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అదే మాదిరిగా ప్రస్తుతం అక్రమ వ్యాపారులు  స్మగ్లింగ్ కు ఏదే అనర్హం కాదని నిరూపిస్తున్నారు. బంగారం, ఎర్రచందనం, డ్రగ్స్, గంజాయి తదితరాలతో పాటు ఇప్పుడు వానపాములను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మట్టిలో దొరికే వానపాములను స్మగ్లింగ్ చేయడం ఏమిటి, వాటిని స్మగ్లింగ్ చేయడం దేనికి, ఎందుకు అక్రమ మార్గంలో తరలిస్తున్నారు అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

Earthworm Smuggling
Earthworm Smuggling

విషయంలోకి వెళితే.. పులికాట్ సరస్సు ఏపి, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉంది. పులికాట్ సరస్సు ఉప్పు నీటి సరస్సు అయినప్పటికీ చేపలు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉండటమే కాకుండా ఇక్కడ వానపాములు సైతం అధికంగా ఉంటాయి. పులికాట్ సరస్సులో తవ్వే కొద్దీ వానపాములు బయటకు వస్తుంటాయి. అయితే ఈ సరస్సులో మత్స్య సంపదతో పాటుగా పలు రకాల జీవరాశుల అభివృద్ధికి తోడ్పడుతున్న వామపాములు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.   సరస్సు ఆనుకొని ఉన్న చిత్తడి నేలల్లో కొన్ని ముఠాలు అక్రమంగా తవ్వకాలు చేస్తూ వానపాములను ఎదేశ్చగా విక్రయిస్తున్నారు. కిలో వానపాములను వెయ్యి నుండి రూ.1500ల వరకూ ఇస్తామని స్మగ్లర్ లు చెప్పడంతో కొంత మంది ఇదే పనిగా రోజు వానపాముల సేకరించడమే వృత్తిగా పెట్టుకుంటున్నారు.

స్మగ్లింగ్ ఎందుకు చేస్తున్నారంటే…

నెల్లూరు జిల్లాలో అక్వా సాగు ఎక్కువగా సాగుతోంది. దీంతో ఎక్కువ శాతం రొయ్యల పెంపకం ఎక్కువగా సాగుతోంది. దీంతో పిల్ల రొయ్యలకి అధికంగా డిమాండ్ ఉంది. తల్లి రొయ్య సంతానోత్పత్తికి ఆహారంగా వానపాములను మేతగా వినియోగిస్తున్నారు. వానపాములు ఆహారం కావడంతో అధిక శాతం గుడ్ల్లను పెడుతున్నాయి రొయ్యలు. అధిక దిగుబడి కోసం అక్వా ఫుడ్ యాజమానులు కిలో రూ.3500ల నుండి రూ.4వేల వరకూ వెచ్చించి వానపాములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వానపాముల స్మగ్లింగ్ జరుగుతోంది.


Share

Related posts

నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖ SEC ఆఫీస్ లో తయారు కాలేదు అని తేల్చిన ఫోరెన్సిస్

Siva Prasad

Fenugreek seeds: మెంతులు, మెంతికూర ప్రయోజనాలు తెలుసుకోండి!!

Kumar

బిగ్ బాస్ 4 : పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన ఈ బిగ్ బాస్ స్టార్

arun kanna