NewsOrbit
న్యూస్

జగన్ చేసిన పనినే చెయ్యమంటున్న ఎయిమ్స్‌ అథ్యయనం!

అవగాహన లేదు.. అనుభవం లేదు.. మాలాంటి మేధావులను సంప్రదించాలన్న ఆలోచనల లేదు.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు కానీ… కరోనా విషయంలో జగన్ ఆలోచనలు కరక్టే అని రోజుకో రకంగా తెలుస్తుంది! కరోనాను అంత సీరియస్ గా తీసుకోవద్దు.. అలా అని నిర్లక్ష్యం అస్సలు వహించొద్దు అని జగన్ చెప్పిన మాటే అనంతరం అంతా చెప్పారు అనే సంగతి అటుంచితే… కరోనా విషయంలో ఏపీలో జగన్ చేస్తున్న విస్తృత టెస్టుల పనే అంతా చేయాలని తాజాగా ఎయిమ్స్‌ సూచించింది!

కరోనా విషయంలో జగన్ ఏమి చేసినా, ఏమి చెప్పినా అది తప్పే అన్నట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడేవి! కరోనాతో సహజీవనం చేయాలని జగన్ ప్రకటించిన సమయంలో ప్రతిపక్షాలు మైకుల ముందుకు వచ్చి నానా రాద్ధాంతం చేశాయి. కానీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో సహా మిగిలిన ముఖ్యమంత్రులు చెప్పే సరికి సైలంట్ అయిపోయాయి! ఇదే సమయంలో ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయనే కామెంట్లకు.. పెరుగుతున్న టెస్టుల సంఖ్యే దానికి కరణం అని ఏపీ సర్కార్ చెబుతూ వచ్చింది. ఇది సరైన చర్యే అని ఇప్పుడు ఎయిమ్స్‌ చెబుతుంది.

అవును… కోవిడ్‌-19 కేసులు ముమ్మర దశకు చేరిన మీదట “విస్తృతంగా టెస్టులు నిర్వహించాలి” అని ఎయిమ్స్‌ నేతృత్వంలో చేపట్టిన అథ్యయనం హెచ్చరించింది. కేసులు సంఖ్యలు ఎక్కువగా వెలుగు చూడటం అనే విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడతాయని వెనక్కి తగ్గడం వంటివి చేయడం ఏమాత్రం భావ్యం కాదని… అల్టిమేట్ గా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అంతా భావించాలని నిపుణుల హెచ్చరికలు రాకముందే ఆ పనికి ఏపీ సర్కార్ పూనుకుంది. ఈ సమయంలో తాజా అధ్యయనం ప్రకారం కూడా అదే తేలింది.

లాక్‌ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా వైరస్‌ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తాయని.. “విస్తృతంగా టెస్టులు నిర్వహించిన అనంతరమే లాక్‌ డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేయడంమేలని” ఎయిమ్స్‌ వైద్యుల నేతృత్వంలో సాగిన అథ్యయనం పేర్కొంది. లాక్‌ డౌన్‌ ప్రయోజనాన్ని పూర్తిగా పొందేందుకు భారత్‌ మరికొంత కాలం వేచిచూడాలని సూచించిన ఈ అధ్యయనం.. రోజువారీ కరోనా వైరస్‌ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేదని, ఇలాంటి పరిస్థితిలో లాక్‌ డౌన్‌ కు భారీగా సడలింపులు ఇవ్వడం వల్ల వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది.

 

 

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju