మనం వంట చేయడం మొదలు పెట్టిన దగ్గరనుండి పూర్తయ్యేలోపు కిచెన్ ఒక పెద్ద చెత్తబుట్టలా మారిపోతుంది. ఆ చెత్తలో మనకు పనికొచ్చే వాటిని కూడా కలిసిపోతున్నాయి.ప్రపంచ వ్యాప్తం గా 80 కోట్ల మంది ఆహారం లేక అలమటించిన పోతుంటే మనం మాత్రం రుచిగా వాడుకో దగిన ఆహార పదార్థాలను కూడా వ్యర్థాలతో కలిపి పడేస్తూ వృథా చేస్తున్నాం.
- ఈ వంటింటి నుండి వచ్చే వృధాను అరికట్టడానికి మొదలైంది జీరో వేస్ట్ కుకింగ్ ఉద్యమం. కాలిఫ్లవర్ ను తీసుకునివండుకుంటాం. దాని కింది కాడలను మాత్రం వృథా గా పడేస్తాం.
- అలా పడేయకుండా కాండాలను కూడా కూర చేసుకోవచ్చు. అలాగే నిమ్మరసాన్ని తీసిన తర్వాత ఆ తొక్కలు పచ్చడి కి తీసుకుంటే వృథా తగ్గించవచ్చు .
- నిమ్మ, దానిమ్మ తొక్కలను చెత్తబుట్టలో పారవేయకుండా వాటిని నీళ్లలో వేసి కాస్త ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి ఉడికించి, వడగట్టి తాగితే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి అని ఆహార నిపుణులు తెలియచేస్తున్నారు .బంగాళా దుంపలు, కాకరకాయ, బీరకాయ, ఇలా ప్రతి కొన్ని కొన్ని వాటిమీద చెక్కు తీయకుండా వండుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- ఒకవేళ అలా చెక్కు తీసిన కూడా దీంతో పచ్చడి చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన నూటికి నూరుశాతం వాడుకున్నట్లు ఉంటుంది.
- గుమ్మడికాయ గింజలు లాంటివాటిని పడేయకుండా, ఎండబెట్టి వేయించుకుంటే సాయంత్రం స్నాక్స్‌లా వాడుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది.
- యాపిల్ పై తొక్కల్ని తీసినప్పుడు వాటిని టీ పెట్టుకునే నీళ్లలో వేసి మరిగిస్తే టీ ఘుమఘుమ లాడుతూ మంచి సువాసనలు వెదజల్లుతుంది.
- పచ్చని ఆకుకూరలు కాడల్ని వృథా గా పడేయకుండా వాటిని ముక్కలు చేసి కూర వండుకుంటే బోలెడన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి.