NewsOrbit
న్యూస్

కరోనా ఉందేమోనని డౌట్ గా ఉందా ? టెస్ట్ లేకుండా ఇలా తెలుసుకోవచ్చు !

కరోనా సోకిందో లేదో పరీక్షించుకోవడానకి ఇక ల్యాబ్ లకు పరిగెత్తనక్కరలేదని, ఇంట్లోనే చిన్నపాటి పరీక్షలతో దీన్ని 50% ధృవీకరించు పోవచ్చునని ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి కొత్త సూచన చేస్తున్నారు. సింఫుల్ విధానంతో సమస్య తీవ్రతను గుర్తించే వీలుందని చెబుతున్నారు.

ఎవరికి వారు వంద అడుగులు నడిస్తే వైరస్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వంద అడుగులు నడిచే సమయంలో ఆయాసం లాంటివి వస్తే కొంత సమస్య ఉన్నట్లుగా అనుకోవచ్చని చెబుతున్నారు. ఈ విధానాన్ని విజయవాడలో ఒక వంద మందితో పరీక్షించగా 58 మంది ఆయాస పడ్డారని.. వారికి కరోనా పరీక్ష నిర్వహించ గా ఎనిమిది మంది కి పాజిటివ్ వచ్చినట్లుగా చెప్పారు. మహమ్మారి ఉందా? లేదా? అన్న విషయాన్ని ప్రాథమికంగా తేల్చేందుకు ఈ విధానం సురక్షితమైనదన్న మాట వినిపిస్తోంది. ప్రతిసారీ టెస్టు కోసం పరుగులు తీసే కన్నా.. ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు.. ఈ విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సిఫార్సు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అక్కడెక్కడో వూహాన్ లో ఉందన్న మహమ్మారి ఇప్పుడు మన వీధుల్లోకి వచ్చింది. కొందరికైతే ఇప్పటికే పక్కిళ్లకు.. వెనకిళ్లకు పాకేసింది. దీంతో.. ఇప్పడు అందరిలోనూ ఆందోళన. ఏమవుతుందోనన్న భయం. కాస్తంత దగ్గు వచ్చినా.. ఒళ్లు నొప్పులుగా అనిపించినా.. గొంతులో నొప్పి అనిపిస్తే చాలు.. మహమ్మారి అంటేసిందన్న అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ.. పరీక్ష ఒక్కటే మార్గమని చెబుతున్నా అందులో నిజం లేదు.

ఎందుకంటే.. ఇవాళ పరీక్ష చేయించుకుంటే.. ఇవాల్టి వరకూ మాత్రమే వైరస్ లేనట్లు. అది కూడా పరీక్ష పక్కాగా చేస్తేనే. ఏ చిన్న లోపంతో శాంపిల్ సేకరణ జరిగినా.. వైరస్ లోడ్ గుర్తించే అవకాశం మిస్ అవుతుంది. టెస్టు తర్వాత ఇంటికి వస్తూ దారిలో కూడా వైరస్ అంటుకునే అవకాశం లేకపోలేదు.ఈ పరిస్థితుల్లో ఏపీ కరోనా నోడల్ అధికారి చేసిన సూచన అమూల్యం గానే కనిపిస్తోంది.ఇంకెందుకాలస్యం ఇంట్లోనే ట్రై చేసుకుందాం.









author avatar
Yandamuri

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju