Eatela Rajendar: ఈట‌లను కేసీఆర్ మామూలుగా ఇరికించ‌ట్లేదుగా

Share

Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ప‌ద‌వి కోల్పోయిన ఈట‌ల‌ను పార్టీ నేత‌లు టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రిన్ని ప్ర‌ణాళిక‌లు ఈటల కేంద్రంగా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కీలక నేతలు టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించగా.. తాజాగా మంత్రి గంగులను శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు కలిసి ఈటలకు షాక్ ఇచ్చారు.

ఈట‌లను గంగుల మామూలుగా ఇరికించ‌ట్లేదుగా

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కార్య‌క‌ర్త‌లు మంత్రి గంగులను కలవడమే కాకుండా.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మంత్రి గంగులకు వినతి పత్రం అందజేశారు. ఈటల బర్తరఫ్ తో తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈటల ఉద్యమకారులను పక్కనపెట్టి సొంత వారికి పెద్దపీట వేశారని.. ఈటల ది డివైడ్ అండ్ రూల్ పాలసి అని శనిగరం, మర్రిపల్లిగూడెం ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను అనగదొక్కడాని.. పార్టీని అడ్డుపెట్టుకొని ఆర్ధికంగా ఎదిడాని ఫైర్ అయ్యారు. సొంత మండలంలో అభివృద్ధి అంతంత మాత్రమేనని.. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని వారు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి గంగుల హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి గంగుల వెల్లడించారు.

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?
Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

అటు అండ ఇటు అరెస్టులు..

హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రములో కేసీఆర్ కు మద్దుతుగా ప్రెస్ మీట్ పెడుతుండగా ఈటల వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరిగింది. దాంతో ఈటల వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో నిబందనలు ఉల్లఘించి మద్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ప్రశ్నిచారు ఈటెల వర్గీయులు. తమకు 10 గంటల లోపే అనుమతి అని చెప్పి ఇప్పుడు పోలీసులు ఎలా అనుమ‌తి ఇచ్చారని ప్రశ్నించారు. అనంత‌రం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓవైపు అరెస్టులు మ‌రోవైపు ఈట‌ల మ‌ద్ద‌తుదారుల‌కు త‌మ వైపు ఆక‌ర్షించ‌డం అనే ఎత్తుగ‌డ‌ల‌తో టీఆర్ఎస్ పార్టీ జ‌రుగుతోంద‌ని అంటున్నారు.


Share

Related posts

‘జగన్ సర్కార్‌ తీరుపై కన్నా ఫైర్’

somaraju sharma

ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Mahesh

లంచ్ టైంకి ఆసీస్ 89/4

Siva Prasad