NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ .. ఆ నేత ఎన్నికల ప్రచారంపై నిషేదం

Election Commission

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఉదృతంగా జరుగుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయనకు నిషేదం విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదంటూ సీఈసీ నిషేదం విధించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఓటర్లను బెదిరించేలా ప్రసంగాలు చేశారన్న అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సాయంత్రం నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులో పేర్కొంది. జగదీశ్ రెడ్డి ఎలాంటి బహిరంగ సభల్లో, ప్రదర్సనలు, ర్యాలీ, రోడ్ షోల్లో పాల్గొనకూడదని మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని తెలిపింది.

Election Commission

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి కే ప్రభాకరరెడ్డి విజయం కోసం మంత్రి జగదీశ్ రెడ్డి అన్ని తానే అయి ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పలువురు మంత్రులు మండలాలకు ఇన్ చార్జిగా పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. ఈ తరుణంలో జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించకుండా ఈసీ నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Jagadishwar Reddy

 

మరో పక్క బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి లు, ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారాలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధుల ప్రచారానికి భిన్నంగా స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విన్నూత్నంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు హస్యాన్ని అందిస్తున్నారు. ప్రజలకు ఆయన రకరకాల హామీలు ఇస్తున్నారు.

Munugode By Poll TRS

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju