న్యూస్

Panjab Elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..

Share

Panjab Elections: ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యుల్ ప్రకారం పంజాబ్ లో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 16న యూపీలోని బెనారస్ లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉత్సవాలు ముందే ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 10 నుండి జరిగే గురు రవిదాస్ జయంతి వేడుకలకు దాదాపు 20 లక్షల మందికిపైగా భక్తులు వెళతారనీ, 14న ఎన్నికలు అయితే వీరు పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదనీ కావున ఆరు రోజుల పాటు పోలింగ్ ను వాయిదా వేయాలని పంజాబ్ అధికార కాంగ్రెస్ తో సహా వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి.

EC Key decision on Panjab Elections
EC Key decision on Panjab Elections

 

Panjab Elections: పంజాబ్ లో పోలింగ్ తేదీ మార్పు

ముందుగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా ప్రధాన పార్టీలైన బీఎస్పీ, బీజేపీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో నేడు కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశమై పంజాబ్ లో పోలింగ్ తేదీని మార్పు చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలింగ్ తేదీని ఫిబ్రవరి 20కి మార్పు చేస్తూ కొత్త షెడ్యుల్ విడుదల చేసింది.

 

ఇదీ కొత్త ఎన్నికల షెడ్యుల్ ..

  • జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • నామినేషన్ ల తుది గడువు ఫిబ్రవరి 1
  • నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2
  • నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 4
  • ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20
  • ఓట్ల లెక్కిపు  మార్చి 10

 


Share

Related posts

కాషాయం గూటికి మరో పది మంది!

somaraju sharma

ఆదిపురుష్ లో అనన్య పాండే కి కూడా ఛాన్స్ ఉందా ..?

GRK

నివేదా పేతురాజ్ అందుకే పనికొస్తుందా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar